MLC Kavitha : హైదరాబాద్ ధర్నాచౌక్‌లో కొనసాగుతున్న MLC కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్ష మంగళవారం డ్రామాటిక్ మలుపు తిరిగింది. కోర్టు అనుమతి నిరాకరించడంతో, పోలీసులు కవితను దీక్షా స్థలం నుంచి ఇంటికి తరలించే ఏర్పాట్లు ప్రారంభించారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే, పోలీసులు మరోసారి కవితను దీక్ష విరమించాలని కోరారు. అయితే కవిత అనుచరులు, జాగృతి కార్యకర్తలు దీక్ష కొనసాగించాలని పట్టుబట్టారు. పోలీసులు వారిని అడ్డుకుంటూ, వర్షం తగ్గిన వెంటనే కవితను లిఫ్ట్ చేయనున్నట్లు సంకేతాలిచ్చారు.
Dulquer Salmaan : దుల్కర్ తో సినిమా మొదలెట్టిన దసరా నిర్మాత
కోర్టు ఈ నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసినట్లు సమాచారం. అనుమతి కోసం దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించడంతో కవిత దీక్ష కొనసాగించే మార్గం లేకుండా పోయింది. కవిత చేపట్టిన దీక్షకు రాజకీయంగా మద్దతు దొరకడం కష్టమవుతున్న వేళ, కోర్టు తీర్పు ఈ పరిణామాలకు కొత్త మలుపు తిప్పింది. నిరాహార దీక్షను విరమిస్తూ ఎమ్మెల్సీ కవిత ఇంటికి పయనమయ్యారు.
