NTV Telugu Site icon

Kavitha Tweet: ఎమ్మెల్సీ కవిత సెటైరికల్ ట్వీట్.. షర్మిల, బీజేపీ టార్గెట్‌గా..

Kaviths, Sharmila

Kaviths, Sharmila

Kavitha Tweet: తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ రోజు పాదయాత్రతో రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగింది. అధికార టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూ ఈ రెండు పార్టీలు దూకుడు పెంచాయి. వైఎస్‌ ఆర్టీపీ షర్మిల పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న హైడ్రామా కొనసాగింది. ఆమెను పాదయాత్రకు అనుమతి లేదన్న పోలీసులతో వాగ్వాదీనికి దిగిన షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో తను రానని పాద యాత్ర ఎట్టి పరిస్థితుల్లో ఆగదని మొండిపట్టు పట్టారు. దీంతీ పోలీసులు ఆమె కారులో ఉండగానే క్రేన్‌ తో షర్మిలను పోలీస్టేషన్‌ వరకు తీసుకుని వెళ్లి ఆమెతో సహ పలువురిపై కేసు నమోదే చేశారు. అయితే నాయవ్యాదులు, పోలీసుల వాదోపవాదలతో ఎట్టకేలకు ఆమెకు బెయిల్ మంజూరయి షర్మలను విడుదల చేశారు పోలీసులు. ఈనేపథ్యంలో.. షర్మిల టీఆర్ఎస్‌ పై మండిపడ్డారు. అయితే ఆమె స్పందిస్తూ నర్సంపేటలో ఘోరాతి ఘోరంగా మా బస్సులను కాల్చరని, ఆ బస్సును ఆ పగలగొట్టిన బండ్లను కేసీఆర్ దగ్గరికి తీసుకువెళ్లాలని అనుకున్నామని తెలిపారు. కానీ ప్రగతి భవాన్ దగ్గరికి వెళ్లడానికి అడ్డుకున్న తీరు చూస్తే చూస్తే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుందని మండిపడ్డారు షర్మిల. దీనిపై కాంగ్రెస్‌, బీజేపీలు ఎందుకు మాట్లాడటం లేదు? అంటూ ప్రశ్నించారు షర్మిల.

దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ, వైఎస్ఆర్టీపీని టార్గెట్ చేస్తూ సెటైరికల్ ట్వీట్ చేశారు. షర్మిల తానా అంటే తందానా అని బీజేపీ నేతలు పరోక్షంగా ఆక్షేపించారు. వారు వదిలిన బాణం తానా అంటే తామర పువ్వులు అని ట్వీట్ చేశారు. వైఎస్ ఆర్ టీపీ, బీజేపీ పార్టీలు ఒక్కటేనని, వైఎస్ షర్మిల వెనుక బీజేపీ నేతలు ఉన్నారని, షర్మిలతో కలిసి బీజేపీ పార్టీ పెట్టిందని ఆమె ట్వీట్ చేశారు. షర్మిల అరెస్ట్‌ పై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఖండించారు. దీనిపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై కూడా స్పందించారు. షర్మిలను కారులో ఉండగానే క్రేన్‌ తో పోలీస్టేషన్‌ వరకు తీకెళ్లడం చాలా బాధాకరమని అన్నారు. అయితే దీనిపై MLC కల్వకుంట్ల కవిత స్పందించారు. తన ట్వీటర్‌ ఖాతాలో షర్మిలను ఉద్దేశించి చేసిన పోస్ట్‌ ఇప్పుడు సంచలనంగా మారింది. తాము వదిలిన “బాణం” .. తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు” అంటూ పోస్ట్‌ చర్చకు దారితీస్తోంది. ట్వీటర్‌ ద్వారా రాజకీయం రాచేకుంటోంది. మాటలతో కాదు సోషల్‌ వేదికగా రాజకీయం రచ్చరేపుతోంది. నువ్వెంతంటే నువ్వెంత అనే తీరుగా రాజకీయం రగులుతోంది. కవిత ట్వీటర్‌ పోస్ట్‌ ఇప్పుడు రచ్చరేపుతోంది. అయితే తాను ఎవరు వదిలిన బాణం కాదంటూ గతంలో వైఎస్‌ఆర్‌టీపీ షర్మిల చెప్పిన విషయం తెలిసిందే..
Extramarital Affair: ఓ వృద్ధుడిని బలి తీసుకున్న వివాహేతర సంబంధం