Jeevan Reddy: పీవీ నర్సింహా రావు కాంగ్రెస్ వాదీ.. నిన్న హరీష్ రావు ప్రేమ వలకపోస్తే ఆశ్చర్యంగా వుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం గా, పీఎం గా పనిచేశారు పీవీ అన్నారు. ఏ పదవీ చేపట్టిన ఆ పదవీకి వన్నెతెచ్చారనిత తెలిపారు. పీవీ అంతిమ యాత్ర హైదరాబాద్ లో చేపట్టాలని కుటుంబ సభ్యులే కోరారని అన్నారు. అన్ని లాంఛనాలతో గౌరవ వందనలతో చేశారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు విమర్శలు చేయడం బాధాకరం అన్నారు. నిన్న సభలో చర్చలు చూస్తుంటే.. ఉద్యమ పార్టీ అనిచెప్పుకునే బిఆర్ఎస్ నేతలు.. ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతున్న మౌనంగా వున్నారని తెలిపారు. భద్రాచలంకు చెందిన 7 మండలాలు కోల్పోయామని మండిపడ్డారు.
Read also: Sridhar Babu: గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలు ఉండవు.. శ్రీధర్ బాబు కామెంట్
స్వార్ధ పూరిత రాజకీయాలకోసమే.. సీలేరు పవర్ ప్రాజెక్టు కోల్పోవడానికి కేసీఆరే నైతిక బాధ్యత వహించాలని అన్నారు. ఎన్టీపీసీ ద్వారా 4వేల మెగా వాట్ల విద్యుత్ పొందే హక్కు వుందన్నారు. కానీ 2600 మెట్ల వాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయాను అన్నారు. ఐటీఐఆర్ తేవడంలో ఫెయిల్యూర్ అంటూ మండిపడ్డారు. విభజన చట్టం హక్కులను సాధించడంలో విఫలమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. విమర్శలు చేయడం బంద్ చేయండని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును టూరిస్ట్ స్పాట్ గా చేసిందే బీఆర్ఎస్ అంటూ కవితకు సెటైర్ వేశారు. కాళేశ్వరం అవినీతి బయటపెడతామని తెలిపారు. శాసన సభ సభ్యులను తీసుకెళ్లింది మీరు.. సీఎం రేవంత్ తీసుకునే నిర్ణయం శుభపరిణామం అని అన్నారు.
Nagarjuna: నా సామిరంగ… ఏమున్నాడ్రా కింగ్