Site icon NTV Telugu

గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ…?

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదించింది తెలంగాణ కేబినెట్. అయితే గత కాలంగా తెలంగాణలో రాజకీయాలు హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు రానున్నాయి. కానీ ఇదే సమయంలో కాంగ్రెస్ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తెరాస లో చేరారు. దాంతో అక్కడ తెరాస తరపున టికెట్ ఆయనకే ఇస్తారు అనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఈరోజు జరిగిన తెలంగాణ కేబినెట్ లో ఓ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి ని సూచిస్తూ గవర్నర్ కి ప్రతిపాదనలు పంపింది తెలంగాణ క్యాబినెట్. చూడాలి మరి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ ప్రతిపాదనను ఆమోదిస్తారా.. లేదా అనేది.

Exit mobile version