Site icon NTV Telugu

Vanama Venkateshwara rao: ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని వారు పగటికలలు కంటున్నారు..

Vanama Venkateshwara Rao

Vanama Venkateshwara Rao

Vanama Venkateshwara rao: తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని.. తనపై పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు పగటికలలు కంటున్నారని అలానే ప్రచారం చేసుకుంటున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. వారి పగటి కలలు నెరవేరవని వెల్లడించారు. కొత్తగూడెంలో గత ఎన్నికల్లో ఓటమి పాలు అయినా జలగం వెంకట్రావు తాను మళ్లీ వస్తానని ప్రచారం చేసుకుంటున్నారని పరోక్షంగా ఆయనపై వనమా వెంకటేశ్వరరావు కామెంట్ చేశారు. పగటి కలలు కనడం మానేయాలన్నారు. తాను గెలిచిన నాటి నుంచి ఇదే విధంగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని వనమా విమర్శించారు.

Srinivas Goud Live : ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హల్‌చల్

ఇప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచి మూడున్నర ఏళ్లు అయిందని వనమా వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఈ మూడున్నరేళ్లలో కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, కరోనా కష్టకాలంలో ఆదుకున్నామని చెప్పారు. కొందరు గత ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుండి కొత్తగూడెం ప్రజలకు దూరంగా ఉంటూ కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు పన్ని దివాళి కోరు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేయడం ఖాయమని వనమా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించిన సర్వేలో 70 శాతం ప్రజల మద్దతు ఎమ్మెల్యే వనమాకు ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తెలియజేశారని అన్నారు. ఏ రాజకీయ నాయకుడైన ప్రజల మద్దతుతో గెలవాలి కానీ కుట్రలు, కుతంత్రాలతో గెలవాలనుకోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. గోబెల్స్ ప్రచారాలతో ఎక్కువ కాలం ప్రజలను మభ్యపెట్టలేరు అనే విషయాన్ని గ్రహించాలన్నారు.

Exit mobile version