NTV Telugu Site icon

కాంగ్రెస్ ప్రభుత్వ మైన సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది : చొప్పదండి ఎమ్మెల్యే

కేసీఆర్ వాఖ్యల పై బీజేపీ నాయకులు చిల్లర మల్లారా మాటలు మాట్లాడుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేద, బడుగు బలహీన వర్గాల కోసం బీజేపీ ఒక్క సంక్షేమ పథకం ప్రవేశ పెట్టిందా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మైన సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న చోట్ల దళిత మహిళలపై అత్యాచారాలు చేసి చంపిన ఘటనలున్నాయని ఆయన ఆరోపించారు. బడ్జెట్ లో రైతుల కోసం ఒక్క పథకం ప్రవేశ పెట్టలేదని, బీజేపీ వాళ్ళు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. ఏ ఒక్క రంగానికైనా ప్రయోజనం చేకూర్చే విదంగా బడ్జెట్ ఉందా అని ఆలోచన చేయండి అని ఆయన మండిపడ్డారు.

కేసీఆర్ కిట్ లో కేంద్రంది ఒక్క రూపాయి ఉండదని, బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కోసం అడగడం లేదని ఆయన విమర్శించారు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డ్ తీసుకు వచ్చాడా. మాట మీద నిలబడక పోతే రాజీనామా చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. భీమ్ దీక్ష లో దళిత ఎంపీ బాబు రావు ఫోటో లేదని, కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి ఉన్నపుడు చాలా సార్లు రాజ్యాంగం మార్చారన్నారు. సీఎం రాజ్యాంగం కించ పరిచే విధంగా ఎక్కడ మాట్లాడ లేదని, దళిత బంధు 119 నియోజకవర్గంలో అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. దళితుల కోసం ఒక్క పథకమైన తీసుకువచ్చారో బీజేపీ నాయకులు చెప్పాలన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో మేము చిత్తశుద్ధితో ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు.