కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ బీజేపీ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను దగాచేస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా ,24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు. పుట్టిన పిల్లలకు కేసీఆర్ కిట్టు ను అందించడం జరుగుతుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, వృద్ధాప్య, దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక రూపాయి కూడా ఇక్కడికి తెచ్చింది లేదన్నారు. సంక్షేమ పథకాల్లో ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టింద అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో ఈటల,బండి సంజయ్, కిషన్ రెడ్డి, దమ్ముంటే చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇవ్వాలని ఎప్పటినుండో అడుగుతున్న ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటిని సకాలంలో అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. పిల్లల కోసం గురుకుల పాఠశాలను స్థాపించి ఉచిత విద్యను అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు.
