MLA Seethakka Sensatioal Comments On TSPSC Paper Leak Issue: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఎమ్మెల్యే సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. ఈ పేపర్ లీకేజ్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీలో జరుగుతున్న అక్రమాలకు నిరసనగా గాంధీ భవన్‌లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో పాల్గొన్న సీతక్క మాట్లాడుతూ.. ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా పక్కన పెట్టేసి, కేవలం తమ వారి కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. సింగరేణిలో కూడా ఇలాగే అవకతవకలు జరిగాయన్నారు. లాంగ్ జంప్ తగ్గించాలని ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగులు పోరాటం చేస్తున్నా.. ఫలితం లేదన్నారు.
IND vs AUS 1st ODI: భారత బౌలర్ల తాండవం.. 188 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్
ఈ పేపర్ లీకేజ్‌లో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందన్న సీతక్క.. ఎగ్జామ్ రద్దు చేసి చేతులు దులుపుకోవడం కాదని, అభ్యర్థులకు వచ్చిన మార్కుల లిస్ట్‌ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మధ్యం, పబ్స్, బెల్ట్ షాపుల్లో మన తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని దుయ్యబట్టారు. ప్రభుత్వమే యువతను మద్యానికి బానిస చేస్తోందని వ్యాఖ్యానించారు. పేపర్ లీకేజ్‌తో టీఎస్‌పీఎస్‌సీపై నమ్మకం పోయిందని, ఈ లీకేజ్‌లో అధికార పార్టీ లీడర్ల పాత్ర ఉంది కాబట్టే మార్కుల లిస్ట్‌ని బయటపెట్టడం లేదని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు యువతను మభ్యపెడుతున్నాయన్నారు. యువతకు ఆశ పెట్టి, కోచింగ్ సెంటర్‌ల చుట్టూ తిప్పుతున్నారన్నారు. యువతకు పోరాడితే పోయేదేం లేదని.. ఆత్మహత్యలు శరణ్యం కాదని సీతక్క సూచించారు.
SSMB29: ఎక్కించండి.. ఎక్కించండి.. ఇంకా హైప్ ఎక్కించండి
అంతకుముందు కూడా.. కేసీఆర్‌లాగా తాము బోగస్ మాటలు చెప్పమంటూ, కరీంనగర్ బహిరంగ సభలో సీతక్క ధ్వజమెత్తారు. సోనియా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చారని గుర్తు చేసిన ఆమె.. మతం మత్తలో ముంచే బీజేపీతో, మద్యం మత్తులో ముంచే బీఆర్ఎస్ పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మార్పు కోసం కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ సీతక్క కోరారు. రాష్ట్రమంతా మద్యంపై వచ్చే ఆదాయంతోనే నడిచే దుస్థితి నెలకొందన్నారు.