NTV Telugu Site icon

MLA Sanjay Kumar: బీఆర్ఎస్ తో తెలంగాణ మారింది.. జగిత్యాల ఎమ్మెల్యే కామెంట్స్

Brs Mla Jagital Sanjay Kumar

Brs Mla Jagital Sanjay Kumar

MLA Sanjay Kumar: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో తెలంగాణ ఎంతగానో మారిపోయిందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. బీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రజా వ్యతిరేకత, పలు వివాదాల కారణంగా ఈసారి కొంతమంది సిట్టింగులకు పోటీ చేసే అవకాశం రాకపోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల పట్టణంలోని 10వ వార్డులో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ విచ్చేశారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే స్థానికులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో జగిత్యాలలో మళ్లీ ఎవరు పోటీ చేస్తారో తెలియదని మళ్లీ అవకాశం వస్తే ఓటు వేసి మళ్లీ గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. తాను కాకుండా ఎవరు పోటీ చేసినా బీఆర్‌ఎస్ పార్టీ గెలవాలని సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read also: Telangana Congress: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్.. 26న చేవెళ్ల సభలో వైఖరి తేల్చనున్న కాంగ్రెస్

సంజయ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జగిత్యాలను ఎంతో అభివృద్ధి చేశానన్నారు. ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహంతోనే ఈ అభివృద్ధి పనులు చేయగలిగానన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు…ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదు. మళ్లీ జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తే గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. జగిత్యాల ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో తెలంగాణ చాలా మారిపోయిందన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ఎన్నికల సమయంలో ప్రస్తావించలేదని… కానీ అన్నదాతల కోసమే కేసీఆర్ ఈ పథకాలను తీసుకొచ్చారన్నారు. అలాంటి నాయకుడిని మరోసారి ఆశీర్వదించాలని… కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కోరారు. ఇదిలావుంటే, ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో అధికార బీఆర్‌ఎస్‌లో టిక్కెట్ల అమ్మకం మొదలైంది. ఈసారి చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ అవకాశం ఇవ్వడం లేదని సోషల్ మీడియాలోనే కాకుండా ప్రధాన మీడియాలో కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఆయా చోట్ల సిట్టింగ్‌లు అప్రమత్తమై రాజకీయ భవిష్యత్తుపై ఇప్పటికే తమ అనుచరులతో చర్చిస్తున్నారు.

Read also: First List Of BRS: ఆట మొదలైంది.. రేపు 105 మందితో తొలి జాబితా విడుదల..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియకు ఈసారి బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ నిర్ణయమైతే తమకు చాలా సంతోషమని… తమకు కావాల్సింది కూడా ఇదేనని కొందరు ఇల్లందు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి కూడా టికెట్ రాకపోవచ్చని… ఈ టికెట్ ఆశిస్తున్న జీహెచ్ ఎంసీ మాజీ మేయర్ కు కూడా ఆ అవకాశం దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేరును బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పరిశీలించనుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే, మాజీ మేయర్‌తో ఎమ్మెల్సీ కవిత భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎస్సీ రిజర్వ్ వుడ్ జహీరాబాద్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరిన నరోత్తంకు టికెట్‌ ఇవ్వాలని అధిష్ఠానం ఆలోచిస్తోంది. దీంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది.
KTR-Himanshu: అమెరికాకు హిమాన్షు.. ఎమోషనల్ అయిన కేటీఆర్