Site icon NTV Telugu

NTR centenary celebrations: ఎమ్మెల్యేను బుల్లెట్‌ ఎక్కించుకున్న మాజీ మంత్రి

Sandra

Sandra

NTR centenary celebrations: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఎన్.టి.ఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బస్టాండ్ సెంటర్ లో ఉన్న ఎన్.టి.ఆర్ విగ్రహానికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూల మాలలు వేసి నివాళి ఆర్పించారు. సత్తుపల్లి పట్టణంలో భారీ మోటర్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈనేపథ్యంలో.. ఎమ్మెల్యే సండ్రను బుల్లెట్ ఎక్కించుకొని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నడిపారు. సండ్రను బుల్లెట్‌ పై ఎక్కించుకుని తుమ్మల నడుపుతుండటంతో అభిమానుల్లో ఆనందం వెల్లు విరిసింది. వారి వెంట బైక్‌ ర్యాలీ చేస్తూ ముందుకు సాగారు. దీంతో ఆ వాతావరణం అంతా సందడిగా మారింది.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎన్.టి.ఆర్ శత జయంతి సందర్భంగా ప్రతి పల్లె, ప్రతి రాష్ట్రం దేశ విదేశాల్లో జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నా ఎకైక వ్యక్తి ఎన్.టి.ఆర్ అన్నారు.

Read also: Fire Accident : పెళ్లింట చావు బాజా.. వరుడితో సహ అక్కా చెల్లెళ్లు సజీవదహనం

రాజకీయం అంటే సంక్షేమ కార్యక్రమాలు, పేదలు బడుగు బలహీన వర్గాలకు తోడుగా ఉండటమే రాజకీయం అని చాటిన వ్యక్తి ఎన్ టి ఆర్ అని తెలిపారు. ఎన్.టి.ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎవ్వరు కాదనలేనిదని అన్నారు. ఎన్.టి.ఆర్ పుణ్యాఫలాలు సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం ఉంటాయన్నారు. ఎన్.టి.ఆర్ పెట్టిన రాజకీయ బిక్ష పెట్టారన్నారు. ఎన్.టి.ఆర్ కార్యక్రమాలల్లో ఎవ్వరు ఏమనున్నారు పాల్గొంటామన్నారు. ఇక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. పారిపాలనలో తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి ఎన్.టి.ఆర్ అన్నారు. సంక్షేమానికి చిరునామాగా ఎన్.టి.ఆర్ ఉండటం గర్వ కారణమని తెలిపారు. ఎన్.టి.ఆర్ సంక్షేమ కార్యక్రమాలను కేసిఆర్ అమలు చెయ్యటం స్పూర్తి దాయకమన్నారు. తెలుగు రాష్ట్రాలల్లోనే కాకుండా అమెరికా లాంటి దేశల్లో ఎన్.టి.ఆర్ శత జయంతి ఉత్సవాల్లో జరుగుతున్నాయని గుర్తు చేశారు.
Jharkhand : కట్నం తెస్తావా.. నీ వీడియోలు నెట్లో పెట్టాలా.. శాడిస్టు భర్త అరాచకం

Exit mobile version