Rekha Naik: నేడు బీఆర్‌ఎస్‌కు రేఖా నాయక్ రాజీనామా..! ఇండిపెండెంట్ గా పోటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rekha Naik: నేడు బీఆర్ఎస్ కు ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ రాజీనామా చేయనున్నారు. మరో సారి పోటీ చేసేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్ నిరాకరించడంతో నిరసచెందిన రేఖనాయక్ బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నారు. టికెట్ల ప్రకటన విడుదల చేసిన అప్పటి నుంచి అధిష్ఠానం పై ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నట్లు సమాచారం. నిధుల మంజూరు నిలిపివేశారంటూ పలు మార్లు అధిష్ఠానంపై రేఖా నాయక్ ఆరోపణలు చేసిన విషయం తెలసిందే.. దీంతో ఇవాళ రేఖా నాయక్ బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నారు. ఈ విషయంపై ఖానాపూర్ లో ఎమ్మెల్యే రేఖా నాయక్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నట్లు మీడియా ద్వారా రేఖనాయక్ ప్రకటించనున్నారు. ఏ పార్టీలోకైనా వెళ్తారా? ఇండిపెండెంట్ గా బరిలో నిలుస్తారా? అనే దానిపై రేఖా నాయక్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే రేఖా నాయక్.. భర్త శ్యాం నాయక్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే..
మరోవైపు తెలంగాణ ప్రభుత్వంపై ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.. ఏసీడీపీ నిధులు ఆపారని, అభివృద్ది ఆపడం ఏంటీ అంటూ ఆమె ప్రశ్నించిన దాఖలాలు ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, రోడ్ల పనులు ఆపారు.. నిధులు రాకుండా నిలిపి వేశారు అని ఎమ్మెల్యే అడిగారు. నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను.. పార్టీ మారలేదు.. ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని రేఖానాయక్ తెలిపినా ఆమె మాటలకు స్పందన రాలేదు. ప్రజలకు అభివృద్ది కావాలి.. నేను నిధులు అడిగితే కాంగ్రెస్ పార్టీ అంటున్నారు.. నేను పార్టీ మారలేదు రేఖా నాయక్ తెలిపారు. పార్టీ మారింది నా భర్త.. నేను కాదు అని ఆమె అన్నారు. కావాలనే తన అల్లుడు ఐపీఎస్ బదిలీపై స్పందిస్తూ ఖనాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు కూడా. అన్యాయం చాలదన్నట్లు నా బిడ్డకు అన్యాయం చేసారు అంటూ కార్యకర్తల దగ్గర బోరున రేఖా నాయక్ విలపించారు. నా భర్త కాంగ్రెస్ లోకి వెళ్లారు.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వారి తండ్రి సీపీఐ పార్టీలో పనిచేయడం లేదా అని ఆమె ప్రశ్నించారు రేఖానాయక్. తెలంగాణ ఉద్యమంలో పని చేశాను.. నియోజకవర్గం కోసం పని చేశాను.. 9 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను.. అభ్యర్థి కోసం అభివృద్దిని ఆపడం ఏంటీ అని ఖనాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అడిగారు. ఇది మంచి పద్దతి కాదు.. ఇలాంటి దొరణి ఏదైనా ఉంటే ప్రభుత్వం వెంటనే దాన్ని మార్చుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించినా ఫలితం సూన్యం గానే ఉండటంతో చివరకు రేఖానాయక్ బీఆర్ఎస్ కు ఇవాళ రాజీనామా చేయనున్నారు. అయితే ఏ పార్టీలో వెళతారు? లేక ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Shiva Karthikeyan: సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న అయలాన్ టీజర్ వస్తోంది
Also Read
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
- Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
తాజావార్తలు
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?