MLAs poaching case: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. గతంలో సీబీఐతో విచారణకు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆర్డర్‌పై తెలంగాణ సర్కార్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ కేసును సీబీఐకు ఇవ్వాలా..? వద్దా..? అనే అంశంపై నేటితో తెర పడింది. ఈ తీర్పు ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌లో కీలకం కానుందనే నేపథ్యంలో.. హైకోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాల్టి తీర్పుతో ఈ కేసు ఓ కొలక్కి వచ్చింది. ఇక హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనేదానిపై జనాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో సీబీఐకి అప్పగించింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. ఈ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దుశ్యంత్ దవే వాదనలు వినిపించారు. మరోవైపు.. ఈ కేసులో జనవరి 18న చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే..
Read also: MLAs poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
ఇక మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేయడంపై ఈడీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈనేపథ్యంలో.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎటువంటి మనీలాండరింగ్ జరగనప్పటికీ ఈడీ కేసు నమోదు చేయడం చెల్లదని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌కు సమాధానం ఇవ్వడానికి సమయం ఇవ్వాలని రోహిత్‌రెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేయడంతో.. విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.
Asifabad Bus accident: బస్సునుంచి బయటకు దూకిన డ్రైవర్.. కారణం ఇదే..