MLA Padma Devender Reddy Car Accident.
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ పట్టణంలో నేడు పర్యటించారు. ఈ పర్యటన అనంతరం రామయంపేటలో ఓ వివాహానికి హాజరయ్యేందుక వెళ్తున్న క్రమంలో అక్కన్నపేట రైల్వే గేట్ వద్ద వెనుక నుంచి వస్తున్న వాహనం వేగంగా ఢీకొట్టింది. దీంతో భారీ శబ్దంతో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఉన్న వాహనం ఎరిగిపడింది. అయితే వాహనం వెనుకనుంచి వచ్చి ఢీకొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం నుంచి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు.