Malla Reddy: పులి బయటకు వస్తోంది త్వరలో ….అప్పుడు ఆట మొదలవుతుందని మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మల్కాజ్ గిరి సన్నాహక సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లో అయిదు పదవులు ఉన్న ఏకైక నేత శంబిపూర్ రాజు అన్నారు. శంబిపూరి రాజుతోనే ఇన్ని సీట్లు గెలవడం సాధ్యం అయ్యిందన్నారు. బీఆర్ఎస్ సర్కార్ మంత్రి వర్గంలో తన పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలను గెలిపించింది నేనే అన్నారు. హరీష్ రావు కు కూడా ఈ సారి మరక అంటిందన్నారు. ఆరు గ్యారెంటీ లను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అమలు చేయలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ లో అంతా యువ నేతలే… నేను కూడా యువకుడినే అంటూ హాస్యాస్పదం చేశారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ ములో యుద్ధం చేయాలి… బీఆర్ఎస్ గెలవాలన్నారు. ప్రజలు మర్చిపోయి కాంగ్రెస్ పార్టీకీ ఓటు వేశారన్నారు. పులి బయటకు వస్తోంది త్వరలో ….అప్పుడు ఆట మొదలవుతుందన్నారు.
Read also: Shoaib Malik: పెళ్లైన కొద్ది గంటల్లోనే.. చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్!
ఇటీవల గోవాలో పారా గైడింగ్‌తో అలరించిన మల్లన్న.. తాజాగా దుబాయ్ షేక్‌గా మారాడు. దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తూ.. ఎడారిలో ఆల్-టెరైన్ వెహికల్‌ని జోష్‌గా నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూత్ లుక్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మల్లన్న.. ఎన్నికల తర్వాత రిలాక్స్ అయ్యేందుకు పర్యటనలకు చేస్తున్నారు. అంతేకాదు ఎన్నికల్లో ఆయనతో పాటు వుంటూ కష్టపడిన నేతలను కూడా తన వెంట తీసుకుని వెళల్ఇ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ చేరుకున్న మల్లన్న మల్కాజ్ గిరి సన్నాహక సమావేశంలో పాల్గొని ప్రచారంలో పాల్గొన్నారు.
Shoaib Malik: పెళ్లైన కొద్ది గంటల్లోనే.. చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్!