NTV Telugu Site icon

MIM And Bjp Tieup: జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా వుంటున్నాయి. బీజేపీ నేతలపై టీఆర్ ఎస్ నేతలు మండిపడుతూనే వున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎంఐఎం పార్టీ తో టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం అని బీజేపీ విమర్శిస్తోంది. మరి ఎంఐఎం అధినేత ఓవైసీ పై కాల్పులు జరిగిన తీరును చూస్తే ఎవరు ఎవరితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారో అర్థమవుతుందన్నారు లక్ష్మారెడ్డి.

కర్ణాటకలో జరుగుతున్న హిజ బ్ గొడవ.. ఎక్కడ తెలంగాణ వరకు వ్యాపిస్తుందో అన్న ఆందోళన కలుగుతోందన్నారు. భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం స్వార్థబుద్ధితో కర్ణాటకలో హింసను ప్రేరేపిస్తుందని ఆరోపించారు. రెండు మతాలకు చెందిన విద్యార్థులు కొట్టుకునే స్థాయికి దిగజారింది. ఆ గొడవ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మొదలైతే.. హైదరాబాద్ లో కర్ఫ్యూ పరిస్థితులు తలెత్తితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని లక్ష్మారెడ్డి ప్రశ్నించారు.

తామంతా హిందువులమే అయినప్పటికీ బీజేపీ చేస్తున్న జైశ్రీరామ్ నినాదాల వల్ల.. తాము జైశ్రీరామ్ అనలేక పోతున్నాం. దేశంపై భక్తి ఉన్నా.. కాంగ్రెస్ పార్టీకి కూడా మువ్వన్నెల జెండా ఉండటంతో జాతీయ పతాకాన్ని తాము పెట్టుకోలేకపోతున్నామన్నారు.