Site icon NTV Telugu

ష‌ర్మిల దీక్ష‌కు నా పూర్తి మ‌ద్ద‌తు : ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి

రాజ‌న్న బిడ్డ‌గా మా నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్ట‌డం సంతోషంగా ఉంది. ష‌ర్మిల దీక్ష‌కు సంఘీభావం తెలియ‌జేస్తున్నా అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు. వారికి నా పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంది. కేసీఆర్ ఉద్య‌మ‌కారుల‌ను మోసం చేశారు. ఉద్యోగాలను వ‌దిలేసి కుటుంబం కోసం ఆలోచిస్తుండు. వైఎస్సార్ గారు మాకు ప్రాణం. బ‌తికున్నంత వ‌ర‌కూ వైఎస్సార్ మా గుండెల్లో ఉంటారు. మునుగోడు ప్ర‌జ‌ల‌కు వైఎస్సార్ ఉద‌య స‌ముద్రం ప్రాజెక్టు క‌ట్టించారు. ఆ ప్రాజెక్టు ద్వారా ల‌క్ష ఎక‌రాల‌కు నీరందించారు. వైఎస్సార్ 90శాతం ప్రాజెక్టు పూర్తి చేస్తే కేసీఆర్ ఏడేండ్ల‌లో 10శాతం కూడా కంప్లీట్ చేయ‌లేదు అని పేరొన్నారు. ప్రాజెక్టు పూర్త‌యితే వైఎస్సార్ కు పేరు వ‌స్తుంద‌ని ప‌నులు పూర్తి చేయ‌డం లేదు. ఈ ప్రాంతంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డికి ఎంతో మంది అభిమానులున్నారు. మిమ‌ల్ని చూస్తే ఆయన్ని చూసిన‌ట్టుంది అని తెలిపారు.

Exit mobile version