NTV Telugu Site icon

MLA Jeevan Reddy : ఆయనను ఎల్లమ్మ రాజకీయ బలి తీసుకుంటుంది

ఆర్మూర్‌ ఎమ్మెల్య జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఆదివారంయన నిజామాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో జేబులు కట్‌ చేసి నిజామాబాద్‌ ఎంపీ బ్లేడ్‌ బాబ్జీగా మారాడని, అందుకే గొంతు కోసుకుంట అంటున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ అంటేనే బ్రోకర్ల పార్టీ అనీ రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. గతంలో బండ్ల గణేశ్‌కు పట్టినగతే పడుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఇలాంటి బ్యాచ్‌ చాలా మంది జమయ్యారనీ, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి గడ్డం తీసుకోను అని ఏమయ్యారో తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.

మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని జీవన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఎల్లమ్మ తల్లిపై తప్పుగా మాట్లాడిన ఎంపీ అర్వింద్‌ ముక్కు నేలకు రాయాలని, 2023లో ఆయనను ఎల్లమ్మ రాజకీయ బలి తీసుకుటుందంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే పసుపు రైతులను మోసం చేసినందుకు గొంతు కోసుకోవాలన్నారు. కేటీఆర్‌, కవిత లాంటి గొప్ప వ్యక్తుల గురించి అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.