తెలంగాణలో వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేస్తున్నారు. వీఆర్ఏల సమస్యల్ని తీర్చి వారికి దసరా కానుక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ని కోరారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. వెంటనే విఆర్ఏ డిమాండ్స్ ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం VRAల పే స్కేల్ పెంచాలని, ప్రమోషన్స్ ఇవ్వాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. వారసులకు ఉద్యోగాల జీవోలు విడుదల చేయాలి. గత మూడు నెలల నుండి VRA లు ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
మూడు నెలల నుండి జీతాలు లేవు. ఇప్పటికే ఒత్తిడి తట్టుకోలేక 28 మందికి పైగా VRA లు చనిపోయారు. ఇందులో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అనేక మంది VRAలు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ ఈ రాష్ట్రానికి సీఎం ఆయనకు కోపం తగదు.. సీఎం అంటే తండ్రి లాంటి పోస్ట్. పిల్లలపై కోపం వచ్చిన మళ్ళీ వారిని దగ్గరికి తీసుకోవాలి. ఉన్నత అధికారులు గ్రామాలలో ఈ VRAలపై పని భారం వేస్తున్నారన్నారు. దీని వల్ల VRAలు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారు. వారు ఎన్నో అనారోగ్య సనస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంగారెడ్డి నియోజకవర్గంలో 250 మంది VRA లు ఉన్నారు. వాళ్ళందరితో నేను నేరుగా మాట్లాడడం జరిగింది, వారి స్థితిగతులను చూడడం జరిగిందన్నారు.
Read Also: CM KCR: డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగసభ.. భారత రాష్ట్రసమితి వైపే మొగ్గు
100 ఏళ్లు బ్రతకాల్సిన VRAలు 45 నుండి 50 ఏళ్ల వయసుకే పని భారంతో చనిపోతున్నారు. నెలకు ఇచ్చే 12 వేల జీతం వాళ్ల పెట్రోల్ ఖర్చులకు సరిపోతున్నాయి.. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో VRAలను కాపాడాలి. మీరు ఇచ్చిన వాగ్దానమే కాబట్టి మాట నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నానన్నారు.
Read Also: Unstoppable With NBK 2: బాలయ్య అన్‌స్టాపబుల్-2 ట్రైలర్ వచ్చేస్తోంది..!!
