Site icon NTV Telugu

MLA Jagga Reddy : మోడీ-కేసీఆర్‌ది చీకటి రాజకీయ అక్రమ సంబంధం

Jagga Reddy On Kcr

Jagga Reddy On Kcr

మరోసారి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పేద ప్రజలకు 15 లక్షలు ఇస్తామన్న మోడీని ఇవ్వమని ఎందుకు అడగలేదు బండి సంజయ్ అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా 2కోట్ల ఉద్యోగాల గురించి మోడీని ఎందుకు అడగలేదని ఆయన అన్నారు. ఒక్కరోజు కూడా గుడికి పోని బండి సంజయ్ శివలింగల మీద మాత రాజకీయమా… మతాల పేరుపై ప్రజలను బీజేపీ రెచ్చగొడుతుంది ప్రజలు ఇది గమనించండి అని ఆయన వ్యాఖ్యానించారు.

తమిళనాడు సీఎం స్టాలిన్ మొగోడే ప్రధానిని నిలదీసిండు అంటూ ఆయన కొనియాడారు. కేసీఆర్ గారు మీరు ఇక్కడే ఉంటే నిలదీసేవారు కదా ఎందుకు ఆ లాజిక్ మర్చిపోయారు అని ఆయన అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఎప్పుడు అన్ని మతాలను, కులాలను గౌరవిస్తుందని, కాంగ్రెస్ పార్టీ మతలపరంగా, కులలపరంగా రాజకీయం చేయదని ఆయన వెల్లడించారు. మోడీ-కేసీఆర్‌కి చీకటి రాజకీయ అక్రమ సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. అందుకే కేసీఆర్ బెంగళూర్ పోయాడని జగ్గారెడ్డి విమర్శించారు.

Exit mobile version