NTV Telugu Site icon

Jagga Reddy: రాజీనామాకు బ్రేక్‌ మాత్రమే.. వెనక్కి తగ్గేదిలేదు..!

జగ్గారెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. అధిష్టానానికి లేఖరాసి.. ఇక తాను కాంగ్రెస్‌ గుంపులో లేనని పేర్కొన్న ఆయనను సముదాయించడానికి సీనియర్లు రంగంలోకి దిగారు.. జగ్గారెడ్డి రాజీనామా చేయకుండా సముదాయించామని, ఆయన లేవనెత్తిన అంశాలపై అధిష్టానంతో మాట్లాడుతామని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే.. జగ్గారెడ్డికి కొన్ని ఇబ్బందులున్నాయని, తమ దృష్టికి తెచ్చారని తెలిపిన ఆ నేతు.. జగ్గారెడ్డి కార్యకర్తల సమావేశానికి రాజీనామాకు సంబంధం లేదన్నారు.. అయితే, రాజీనామాకు బ్రేక్‌ మాత్రమే వేశా.. తప్పితే వెనక్కి తగ్గలేదని తాజాగా ప్రకటించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

Read Also: Review: భీమ్లా నాయ‌క్

ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. రాజీనామాపై బ్రేక్ వేశా తప్పితే వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు.. కార్యకర్తలు అడిగే అన్నింటికీ సమాధానం చెప్పలేనన్న ఆయన.. నేను ఏం చెప్పాలని అనుకున్నాను అదే చెప్పా అన్నారు.. ఇక, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఎలా మాట్లాడాలో కూడా తెలియదంటూ మరోసారి.. రేవంత్‌ను టార్గెట్‌ చేశారు.. నేను ఎవరి ట్రాప్‌లో పడను.. పడలేదని పేర్కొన్న ఆయన.. ఎవరైనా నా ట్రాప్‌లోకి రావాల్సిందేనన్నారు.. అసలు సోషల్ మీడియా ప్రచారం ఎవరు చేస్తున్నారో నాకు తెలియదా..? అని ఎదురుప్రశ్నించారు జగ్గారెడ్డి.. సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ పెడతా అని ఠాగూర్ కి ఆరు నెలల క్రితం చెప్పానని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న ఆయన.. ఇప్పటి వరకు ఠాగూర్ దానిపై ఏం చెప్పలేదని అసహనం వ్యక్తం చేశారు.. నేను లక్ష మందితో సభ పెడతానని వెల్లడించారు జగ్గారెడ్డి.