తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. గతంలోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోతానంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పుడు పార్టీ సీనియర్ నాయకుల బుజ్జగించి ఆయన రాజీనామా చేయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు మరోసారి పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదని, పార్టీకి చెందినవారే తనపై ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని, అనుమానాలు నివృత్తి చేసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాత మళ్లీ సభ పెడతానని, సభ… సభ్యత్వ నమోదు… వేరు వేరు అంశాలని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ భేటీ వరకు నా రాజీనామాపై ఎలాంటి నిర్ణయం ఉండదని ఆయన తెలిపారు. అధిష్టానంతో మాట్లాడిన తర్వాత… పీసీసీలో మార్పు వస్తుందేమో చూస్తా..? అని ఆయన ఆయన అన్నారు. నేను కన్ఫ్యూజన్ లో లేను…క్లారిటీ తోనే ఉన్నా.. మా క్యాడర్ కూడా క్లారిటీ తోనే ఉన్నారు అని ఆయన వెల్లడించారు. 13 మంది ఎమ్మెల్యే లు పార్టీ మారి దెబ్బతీశారని, అలాంటి పరిస్థితి భవిష్యత్ లో రాకూడదు అని నా ఆలోచన అని ఆయన అన్నారు.
