Site icon NTV Telugu

Harish Rao: బీఆర్ఎస్ లేకుండా చేయాలని చూస్తున్నాడు.. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్

Harish Rao

Harish Rao

Harish Rao: రేవంత్ రెడ్డి బీజేపీతో ములాఖాత్ అయి బీఆర్ఎస్ లేకుండా చేయాలనీ చూస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్స్ లో ముస్లిం మైనార్టీల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. బీజేపీతో పోరాడుతోంది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. మే 13 తరువాత బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ మీకు అందుబాటులో ఉండరన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ పోరాటం వల్లనే కేసీఆర్ కూతురు జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. బీజేపీతో మేము కలిసి ఉంటే కవిత అరెస్టు అయ్యేవారా ? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బీజేపీతో ములాఖాత్ అయి బీఆర్ఎస్ లేకుండా చేయాలనీ చూస్తున్నాడని మండిపడ్డారు.

Read also: Dulam Nageswara Rao: మరోసారి జగన్ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీ తో కలిసివుండేది రేవంత్ రెడ్డి అన్నారు. బడేభాయ్‌ ఆగేభి తుమ్హారా ఆశీర్వాద్ చాహియే (ఇక ముందుకూడా నీ ఆశీర్వాదం కావాలి) అంటున్నాడని తెలిపారు. అంటే రేవంత్‌ ఉద్దేశం వచ్చే రోజుల్లో కూడా తనే(మోడీ)నే ఉంటాడనా? అని ప్రశ్నించారు. మోడీ ఆశీర్వాదాలు ముందుముందు కావాలనే కదా? అన్నారు. నేను ఆర్‌ఎస్‌ఎస్‌ లో పుట్టాను అని ఒకడు అంటారు, మరొకరేమో అదానికి వెళ్లి కౌగలించుకుంటాడు అన్నారు. రేవంత్‌ తన కుర్చీని కాపాడుకునేందుకు బీజేపీతో ఉన్నాడన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బలహీనులను నిలబెట్టి బీఆర్‌ఎస్‌ కు ఓడించి బీజేపీని గెలిపించాలని చూస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరందరూ ఆలోచించి ఓటు వేయండి. ఈరోజు మెదక్‌ లో బీఆర్‌ఎస్‌ ఎట్టి పరిస్థిల్లోనైనా గెలవడం ఖాయమన్నారు.
Sivakarthikeyan : దళపతి విజయ్ మూవీలో శివకార్తికేయన్..?

Exit mobile version