Site icon NTV Telugu

Etela Rajender: మునుగోడులో ఎగిరేది బీజేపీ జెండాయే

Etela (2)

Etela (2)

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాజగోపాల్ రెడ్డి ని గెలిపిస్తామని అంటున్నారన్నారు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మునుగోడు లో బీజేపీ ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఏ క్షణం లోనైనా ఉప ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు..రాజగోపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు…. పైగా ఎదురు దాడి కి పాల్పడింది ప్రభుత్వం. ఉప ఎన్నికలు వస్తేనే ప్రభుత్వంలో కదలిక వస్తుంది..ఉప ఎన్నికలు వస్తే చాలు పథకాలు, అభివృద్ధి జరుగుతుందన్నారు. మునుగోడులో అభివృద్ధి కోసమే రాజీనామా చేశారు.

Read Also: Pawan Kalyan: పవన్ ధరించిన వాచీ విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు..!!

రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే 10లక్షల మందికి పెన్షన్ లు వచ్చాయి. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కూడా రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే వచ్చింది.. హుజురాబాద్ లో దళితులు 47వేల మంది ఉన్నారు కాబట్టి అక్కడ దళిత బంధు ను ప్రారంభించారు.. మునుగోడులో ఉన్న 17వేల ఓట్లు ఉన్నాయి కాబట్టి గిరిజన బంధు, 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి.. మునుగోడులో గిరిజనులకు గిరిజన బంధు అమలు చేయాలి, దళిత బంధు నియోజకవర్గ ప్రజలందరికి ఇవ్వాలన్నారు. కులం, మతంతో సంబంధం లేకుండా నిరుపేదలకు పేద బంధు ప్రవేశపెట్టాలన్నారు ఈటల.

ఫారెస్ట్ పేరుతో ప్రభుత్వం గిరిజన భూములను బలవంతంగా లాక్కుంటుంది…గిరిజనుల జీవితాల్లో మట్టికొట్టిండు కేసీఆర్..మోటార్లకు మీటర్ల విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో దుబ్బాక ఓటర్లు కర్ర కాల్చి వాతపెట్టారు..గొల్ల కురుమ కుటుంబాలందరికి గొర్రెలు ఇవ్వాలని నా డిమాండ్..నియోజకవర్గంలో నేత కార్మికులకు రావలసిన బకాయిలు ఇవ్వాలి…మునుగోడులో ఏది జరిగినా అది రాజగోపాల్ రెడ్డి వల్లే జరుగుతుందన్నారు. 870 కోట్ల రూపాయల వైట్ మనీ పార్టీ నిధిగా ఎలా వచ్చిందో కేసీఆర్ చెప్పాలన్నారు ఈటల. విమానానికి డబ్బులు ఎవరు ఎలా ఇచ్చారో త్వరలో తెలుస్తుంది. విమానం కొనుక్కొని దేశం మొత్తం తిరగమని తెలంగాణ తెచ్చుకోలేదన్నారు.

Read Also: Tamil Nadu: తాగుడుకి బానిసై… కన్నకూతురి జీవితం చిదిమేసే యత్నం

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ద్వారా మాత్రమే TRS పార్టీని ఎదుర్కోగలం అనే నమ్మకంతో బీజేపీలో చేరాను. బలమైన కారణంతోనే ఏడాది కాలం ఉన్న పదవిని త్యాగం చేసాను.. ధర్మ పోరాటానికి సిద్ధం అయ్యాను.. ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకు ఉంది. మునుగోడులో తమ అభ్యర్థిని ప్రకటించడానికి TRS, కేసీఆర్ భయపడుతున్నారు… మునుగోడు తీర్పు తెలంగాణ ప్రజల తీర్పు అవుతుందన్నారు. తెలంగాణలో ఏం ఉద్ధరించారని జాతీయ పార్టీ పెడుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసారా లేదా అనేది తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు రాజగోపాల్ రెడ్డి.

Read ALso: Shashi Tharoor: మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీలో మార్పు తీసుకురాలేరు.. ఎందుకంటే..?

Exit mobile version