Counterfeit Drugs: అనారోగ్యం వస్తే ఏం చేస్తాం..?? మొదట మేము వైద్యుడిని సంప్రదిస్తాం. ఆ వైద్యుడు పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేసి అవసరమైన మందులను చిట్టిలో రాసి చేతిలో పెడతాడు. మెడిసిన్ చిట్టి తీసుకుని నేరుగా మెడికల్ షాపుకు వెళ్లి మందు తీసుకుంటాం. వైద్యుల సూచన మేరకు ఆ మందులను వాడతాం. డాక్టర్ మంచి మందులు రాస్తాడని, మన జబ్బు తగ్గుతుందని ధైర్యంతో ఉంటాము. వారాలు గడిచినా, నెలలు గడుస్తున్నా వ్యాధి నయం కాదు. కారణం తెలియదు. మళ్లీ డాక్టర్‌ని కలుస్తాం. అతను వైద్యం గురించి వ్రాస్తాడు. మేము మళ్ళీ మందుల దుకాణానికి వెళ్తాము.
Read also: Kevvu Karthik : జబర్దస్త్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం..
మళ్లీ పాత మందునే ఇస్తారు. రెండింటిలో ఒకే రకమైన మందు ఉంటుంది. ఆప్రశ్న మనం అడిగితే.. రెండు వేరే మందులని, ఆ మందు తయారు చేసే కంపెనీ వేరు అని ఉచిత సలహా ఇస్తారు. ఇలాంటి వాటిని ఆసరాగా తీసుకుంటున్నారు కేటుగాళ్లు.. మరికొందరైతే డాక్టర్ దగ్గరకు వెళితే ఎక్కువ ఖర్చు అవుతుందని, మెడికల్ షాపుల్లో నేరుగా తీసుకుంటే తక్కువ ఖర్చు అవుతుందని ప్రకటలు చేస్తూ అమాయక ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారు. కిడ్నీలో రాళ్ల బరువు తగ్గిస్తామని మందులు వారిదగ్గర వున్నాయని నమ్మించి ఎదుటి వారిని బురిడీ కొట్టిస్తున్నారు. అలాంటి మాటలకు ప్రజలు నమ్మి మోసపోతున్నవారు లక్షల్లో.. వేలల్లో ఉన్నారంటే మనం ఎంతగా ఎదుటి వారి మాటలు నమ్ముతున్నామో అర్థమవుతుంది. ఇలాంటి ఘటనే రాజన్న సిరిసిల్లలో చోటుచేసుకుంది.
Read also: Aishwarya Rai Bachchan : అయ్యో.. ఐశ్వర్యకు ఏమైంది.. ఆ కట్టు ఏంటి?
సిరిసిల్లలో నకిలీ మందులు అమ్ముతున్న మెడికల్ షాపులో డ్రగ్ కంట్రోల్ సోదాలు నిర్వహించారు. కిడ్నీలో రాళ్ల బరువును తగ్గిస్తామంటూ మెడికల్ షాపులు మందులు విక్రయిస్తున్నారని పక్కా సమాచారంతో సోదాలు చేపట్టారు. తప్పుడు ప్రచారాలతో నకిలీ మందులు విక్రయించి మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ బ్యూరో కొరడా జులిపిస్తున్నారు. కిడ్నీలో రాళ్లు, అధిక బరువుని తగ్గిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న సంస్థలపై పక్కా సమాచారంతో డ్రగ్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది. పలువురిని అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరి వెనుక ఇంకా ఎంత మంది వున్నారన్నదానిపై ఆరా తీస్తున్నారు.
Conjoined Twins: ఇండోనేషియాలో అరుదైన ఘటన.. 4 చేతులు, 3 కాళ్లతో జన్మించిన కవలలు