NTV Telugu Site icon

AE Rahul Betting Case: కీసర ఏఈ రాహుల్ అరెస్ట్.. ఢిల్లీలో అదుపులో తీసుకున్న పోలీసులు

Ae Rahul Arest

Ae Rahul Arest

AE Rahul Betting Case: ప్రభుత్వ ఉద్యోగంలో అతనికి లక్షకుపైగా జీతం. అయినా డబ్బుమీద ఆశ చావలేదు. ఎలాగైనా సరే ఇంకా సంపాదించాలనే ఆశ పెరిగింది. అతని కన్ను ఆన్‌లైన్‌ బెట్టింగులపై పడింది. అయితే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే ఆన్‌ బెట్టింగ్‌ ల్లో డబ్బులు పెట్టడం స్టార్ట్‌ చేశాడు. ఈజీగా మణి వస్తుందని అనుకున్నాడు. అయితే రాను రాను ఆన్‌ లైన్‌ బెట్టింగులకు బానిస అయ్యాడు. దానికి అతనికి వచ్చే లక్ష జీతం చాలలేదు. చివరకు అప్పు చేసి మరీ బెట్టింగ్‌ చేయడం మొదలు పెట్టాడు. అలా ఒకటి కాదు రెండు కాదు రూ.15కోట్లు అప్పు చేసి బెట్టింగులకు పాల్పడ్డాడు.

Read also: Maruthi Nagar Subramanyam: హీరోగా రావు రమేష్.. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ఫస్ట్ లుక్ విడుదల..

హైదరాబాద్ నగరానికి చెందిన రాహుల్ కీసర మిషన్ భగీరథ ఏఈగా పనిచేస్తున్నారు. AE రాహుల్ కుటుంబంలో ఉన్న అతని భార్య ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో AE , తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులే.. అయితే ఏఈ రాహుల్.. ఆన్‌లైన్ గేమ్‌లు, రమ్మీ వంటి అనేక బెట్టింగ్ గేమ్‌లకు రాహుల్ అడిక్ట్ అయ్యాడు. దాదాపు రూ.15 కోట్లు అప్పులు చేశాడు. కీసర మండల మిషన్ భగీరథ AE రాహుల్ పనులు ఇస్తానని నమ్మించి ప్రైవేట్ కాంట్రాక్టర్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని ఎనమిది నెలల క్రితం పరారయ్యాడు. అయితే.. రాహుల్ వ్యవహారం ఉన్నతాధికారులకు తెలియడంతో ఆరు నెలల క్రితం సస్పెండ్ చేశారు. ఆయనకు సహకరించిన అదే శాఖలో పనిచేస్తున్న అధికారిని కూడా సస్పెండ్ చేశారు.

కాంట్రాక్టర్లకు పనులు ఇప్పిస్తానని నమ్మించి దాదాపు 37 మంది నుంచి రూ.15 కోట్లకు పైగా వసూలు చేశాడు రాహుల్. అయితే డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ బాధితులు ఒక్కొకరు బయటకు వస్తున్నారు. రాహుల్ 15 కోట్ల రూపాయలు వరకు భాదితులు నుండి డబ్బులు వసూలు చేశాడని బాధితుల మాటల్లో లెక్క. తమకు న్యాయం చేయాలని కోరుతూ కీసర పోలీసులను ఆశ్రయిస్తున్న కాంట్రాక్టర్లు. AE రాహుల్ భాదితులు ఇంకా ఉన్నారనీ తెలుస్తోంది. అయితే ఢిల్లీ విమానాశ్రయంలో దుబాయ్ కు చెక్కేసేందుకు రాహుల్ ప్రయత్నిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి రాహుల్ ను అదుపులో తీసుకున్నారు. రాహుల్ ను విచారణ అనంతరం పలు కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
T20 World Cup 2024: సీఏపై ఒత్తిడి తెస్తున్న కోచ్.. ఆస్ట్రేలియాకు కొత్త కెప్టెన్!