Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో దారుణం జరిగింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు వారిని హతమార్చి, మృతదేహాలకు నిప్పంటించారు. మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన జరగగా, ఈ ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.
Read also: MP Komatireddy: కోమటిరెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ల సమావేశం.. పార్టీ చేరికలపై చర్చ
ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ కు చెందిన అక్కాచెల్లెళ్లు మగ్గిడి రాజవ్వ(72), గంగవ్వ(62) గత కొంతకాలంగా ఒకే ఇంట్లోనే కలిసి ఉంటున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగులు వారి ఇంట్లోకి ప్రవేశించారు. అక్కాచెల్లెళ్ల తలపై రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. మృతదేహాలపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కాగా.. ఈ ఉదయం ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని సమీపంలోని స్థానికులు గమనించారు.
ఇంటి కిటికీ వద్దకు వెళ్లి చూడగా రాజవ్వ, గంగవ్వ కాలిపోయిన స్థితిలో పడి ఉన్నారు. షాక్‌కు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ ప్రభాకర్‌రావు, సీఐ సురేష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి హత్యకు కారణాలేంటి? బంగారం కోసమే హత్య చేశారా? లేక పాత కక్షలతో హత్య చేశారా? అన్న కోణంలో విచారణ చేపట్టారు. తమ ప్రత్యర్థుల గురించి తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కేసు దర్యాప్తు చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Minister Roja: సినిమాలో హీరో పాలిటిక్స్‌లో జీరో.. పవన్‌పై రోజా కీలక వ్యాఖ్యలు
