NTV Telugu Site icon

Jubilee Hills Rape Case: మొత్తం ఆరుగురు.. మూడో రోజు సాదుద్దీన్ విచార‌ణ‌

Jublihils

Jublihils

జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నలుగురు నిందితులు పోలీసు కస్టడీలో ఉండగా, మరో ఇద్దరు నిందితుల కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది. దీంతో ఇవాళ (శనివారం) ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించనున్నారు. కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను ఇప్పటికే కస్టడీలో రెండు రోజులు విచారించగా, నేడు మూడవ రోజు కూడా విచారణ సాగనుంది.

ముగ్గురు మైనర్ నిందితులను రెండవరోజైన శనివారం కూడా విచారిస్తారు. మిగిలిన ఇద్దరు నిందితులను ఈ రోజు నుంచి విచారిస్తారు. నిందితులకు కోర్టు ఐదు రోజుల కస్టడీ విధించింది. అయితే, జువైనల్ హోమ్‌లో విచారించేందుకు సరైన ఏర్పాట్లు చేయలేమని, ఈ విషయంలో కోర్టు ఆదేశాలు తమకు వర్తించవని జువైనెల్ హోమ్ అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు ఐదుగురు మైనర్ నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణ జరుపుతారు. మైనర్ నిందితులకు ప్రభుత్వ వైద్యులతో పొటెన్సీ టెస్ట్ చేయించాలని పోలీసులు భావిస్తున్నారు.

ఈ కేసులో చార్జిషీటు వేయాలంటే పొటెన్సీ టెస్టు చేయించడం తప్పనిసరి. అందుకే ఈ టెస్టు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మైనర్ నిందితులను ఐడెంటిఫికేషన్ టెస్ట్ చేయించనున్నారు. నిందితుల్లో ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే మనవడితోపాటు, మరో ఇద్దరు మైనర్స్ ఉన్నారు. మొత్తం ఆరుగురుని జూబ్లీహిల్స్ పోలీస్టేష‌న్‌ లో విచారించే అవకాశం వుంది. అనంత‌రం విడివిడిగా నిందితులను విచారించి, ఆ తరువాత నిందితులందరిని కలిపి విచారించనున్నారు దర్యాప్తు అధికారులు.

అయితే.. నిన్న (జూన్ 10)న‌ జూబ్లీహిల్స్‌ అమ్నీషియా మైనర్ బాలిక‌పై సామూహిక లైంగిక దాడి ఘటనలో బాధితురాలి మెడికల్‌ రిపోర్టును వైద్యులు.. పోలీసులకు అందించారు. కాగా, మెడికల్‌ రిపోర్ట్‌ ప్రకారం.. లైంగిక దాడి జరిగే సమయంలో మైనర్‌ మెడపై నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్టు వెల్లడైంది.

ఆ సమయంలో మైనర్‌.. లైంగిక దాడికి నిరాకరించడంతో నిందితులు ఆమెపై గోళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో మైనర్‌ శరీరంపై 12 గాయాలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌ను మూడోరోజు పోలీసులు విచారిస్తున్నారు. మ‌రి ఈవిచార‌ణ‌లో ఏ1 నిందితుడు సాదుద్దీన్ స‌మగ్ర విచార‌ణ‌లో ఎలాంటి విషయాలు బయట పెట్టనున్నాడో ప్రతి ఒక్కిరు ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

LIVE: సోషల్ మీడియాలో ఫోటోలు..టార్గెట్ అవడానికి మార్గాలు!