NTV Telugu Site icon

Singareni Coal Mines: బొగ్గుగనుల వేలం… హాజరుకానున్న మంత్రులు భట్టి, కిషన్ రెడ్డి

Kishan Reddy Bhatti Vikramarka

Kishan Reddy Bhatti Vikramarka

Singareni Coal Mines: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా నేడు తెలంగాణ బొగ్గు గనుల వేలం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో 10వ రౌండ్ కమర్షియల్ బొగ్గు మైనింగ్ వేలాన్ని జి. కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి సతీష్ చంద్ర దూబే, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బొగ్గు శాఖ కార్యదర్శి అమృత్ లాల్ మీనా తదితరులు పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర బొగ్గు గనుల శాఖ భట్టి విక్రమార్క కు ఆహ్వానం పంపింది. ఇవాళ జరిగే బొగ్గు గనుల వేలంలో పాల్గొంటారని.. రాష్ట్ర ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేరును ఇన్విటేషన్ లో నేషనల్ కోల్ మైన్స్ పేర్కొన్నారు. బొగ్గు గనుల వేలంలో సింగరేణికే బ్లాకులు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నవిషయం తెలిసిందే..

Read also: Nagababu: నేను ఇదే మొదటిసారి అసెంబ్లీ చూడటం..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బొగ్గు గనుల ప్రైవేట్‌ రంగంపై బీజేపీ బిల్లు పెడితే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓటు వేసి మద్దతిచ్చిందని అన్నారు. బిల్లుకు ఆమోదం తెలిపిన బీఆర్‌ఎస్.. నేడు కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఖమ్మంలో జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ సింగరేణి బొగ్గు బావుల వేలంలో పాల్గొనకుండా సింగరేణి సంస్థను నష్టపోయేలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని ధ్వజమెత్తారు. వేలంలో బొగ్గు బావులు ఇతర పార్టీకి వెళ్లకుండా అడ్డుకోలేకపోయిన బి.ఆర్.ఎస్. గోదావరి లోయలోని బొగ్గు గనులను తీసుకోకూడదని బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకున్నాయి. బీఆర్‌ఎస్ వల్లే ప్రభుత్వానికి రెండు బొగ్గు గనులు రాలేదని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణపై ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్న బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి.. తెలంగాణ ఆస్తులు కాపాడాలన్నారు. ఇక తెలంగాణను పదేళ్లు నాశనం చేసిన బీఆర్‌ఎస్‌ ఇంకా అలానే వ్యవహరించాలని చూస్తుందని తెలిపారు…సింగరేణి వేలంపై కేసీఆర్, కేటీఆర్‌లతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని భట్టి విక్రమార్క సవాల్‌ విసిరారు.
ED: కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ..హైకోర్టును చేసి ఈడీ..కొద్ది సేపట్లో విచారణ