Site icon NTV Telugu

మానవత్వం చాటుకున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Vemula Prashanth Reddy

Vemula Prashanth Reddy

మానవత్వం చాటుకున్నారు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి.. కామారెడ్డి జిల్లా పర్యటన ముగించుకుని నిజామాబాద్ జిల్లాలోని మంత్రి స్వగ్రామమైన వేల్పూర్‌కు వెళ్తుండగా మార్గం మధ్యలో ఆర్మూర్ క్రాస్ రోడ్డు వద్ద నేషనల్‌ హైవేపై రోడ్డు ప్రమాదాన్ని గమనించారు.. వెంటనే తన కాన్వాయ్ ఆపి.. క్షతగాత్రుల దగ్గరికి వెళ్లి పరామర్శించిన మంత్రి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.. గాయపడినవారిలో చిన్న పాప ఉండడం చూసి చలించిపోయారు. వెంటనే వైద్య చికిత్స నిమిత్తం ఆర్మూర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తన కాన్వాయ్‌లోని ఓ కారులో పంపించారు. డాక్టర్‌తో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.. కాగా, ఇద్దరు పిల్లలను తీసుకుని దంపతులు వెళ్తున్న బైక్‌ను.. మరో బైక్‌పై వేగంగా దూసుకొచ్చిన యువకుడు వెనకా నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. యువకుడికి కూడా స్వల్ప గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స అందించాలని ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులకు సూచించారు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి.

Exit mobile version