NTV Telugu Site icon

N. Uttam Kumar Reddy: నేడు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మంత్రి ఉత్తమ్‌

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

N. Uttam Kumar Reddy: మేడిగడ్డ సహా కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామ్‌లపై వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్‌ విచారణ కమిషన్.. రాష్ట్ర ప్రభుత్వం తమ తదుపరి కార్యాచరణ వేగవంతం చేయనున్నాయి. జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ ఇవాళ, శనివారం అన్నారం, సుందిళ్ల డ్యామ్‌లను కూడా పరిశీలించనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు క్షేత్రస్థాయిలో మరమ్మతులు, రక్షణ చర్యలను పరిశీలించనున్నారు. ఇంజినీర్లతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించనున్నారు. ఇంజినీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా పురోగతిని సమీక్షిస్తారు. మేడిగడ్డ బ్యారేజీలో మరో రెండు గేట్లను ఎత్తారు. 7వ బ్లాక్‌లో CSMRS గ్రూప్ పరీక్షలు జరుగుతున్నాయి.

Read also: Manamey Twitter Review : శర్వానంద్ ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చేసాడా..?

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికలో చేసిన సిఫారసులకు అనుగుణంగా మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల డ్యామ్‌ల వద్ద మరమ్మతులు, రక్షణ చర్యలకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీలో ముఖ్యమైన గేట్ల ఎత్తివేత పనులు కొనసాగుతున్నాయి. ఏడో బ్లాక్‌లోని ఎనిమిది గేట్లలో ఇప్పటికే ఒక గేట్‌ ఎత్తివేయగా, కుంగిపోయిన పైర్ల మధ్యలో ఉన్న గేటును కోసి తొలగిస్తున్నారు. మిగిలిన ఆరు గేట్లలో గురువారం రెండింటిని తెరిచారు. 16, 17 గేట్లను ఎత్తివేసినట్లు ఇంజినీర్లు తెలిపారు. గతంలో మేడిగడ్డ 16వ గేటు తెరిచే సమయంలో సాంకేతిక సమస్యలతో ఆగిపోయి అంతా సర్దుకుని గురువారం ఎత్తివేశారు. మరో నాలుగు గేట్లను కూడా తెరవాల్సి ఉంది. వాటిని కూడా అదే విధంగా ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read also: Delhi: నకిలీ ఆధార్ తో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు యత్నం.. ముగ్గురు కూలీల అరెస్ట్

ఆనకట్ట వద్ద గ్రౌటింగ్‌తో సహా షీట్ ఫైల్స్, సీసీ బ్లాక్‌ల మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజీ వద్ద పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అన్నారం, సుందిళ్ల వద్ద పనులన్నీ కొనసాగుతున్నాయి. విచారణ కమిషన్‌కు ప్రజల నుంచి 54 ఫిర్యాదులు అందాయి. వాటిని పూర్తిగా పరిశీలించి, ఆధారాలను పరిశీలించిన తర్వాత సమన్లు ​​జారీ చేస్తారు. కమిషన్‌కు సహకరించేందుకు ఏర్పాటైన టెక్నికల్ కమిటీ కూడా ఇప్పటికే మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించింది. అక్కడి పరిస్థితులు, జరిగిన నష్టం, మరమ్మతు పనులు, రక్షణ చర్యలు తదితర అంశాలను పరిశీలించారు. కమిటీ సభ్యులు తమ పరిశీలనలను జస్టిస్ పీసీ ఘోష్‌కు వివరిస్తారు.
Babar Azam Record: చ‌రిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. విరాట్‌ కోహ్లీ రికార్డు బ్రేక్!