Site icon NTV Telugu

కేంద్రం సహకారం లేకుండానే ఆక్సీజన్ ఏర్పాటు చేసుకున్నాం…

ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో 62 ఎకరాల్లో 325 పడకల ఆస్పత్రి కొనసాగుతుంది అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 1200 బెడ్స్ తో వెయ్యి కోట్లతో ఎర్రగడ్డలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతుంది. హైదరాబాద్ మెడికల్ హబ్ గా ఉంది. 5 వేల కోట్లతో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం జరుగుతుంది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నాలుగు గేట్లు ఉండేలా… పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు ఎమ్మెల్యే మాగంటి. అయితే పేషేంట్ వెంట వచ్చే అటెండర్ కు సౌకర్యాల కల్పన, పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఏ వైరస్ వచ్చిన ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని తెలిపారు.

అయితే కేంద్రం సహకారం లేకపోయినా ఆక్సీజన్, వెంటిలేటర్లను ఏర్పాటు చేసుకున్నాం. కొత్త ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా చూస్తాం. ఉస్మానియా ఆస్పత్రి సూపర్ స్పెషాలిటీ చేయాలని సీఎంని కోరుతాం. కోర్ట్ కి వెళ్లడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వచ్చేవారంలో ఉస్మానియా ఆస్పత్రికి కు వెళ్లి పరిశీలించి సీఎం కు నివేదిస్తాం. అమీర్ పేట లో 50 పడకల ఆస్పత్రి ని వంద పడకలు గా మార్చుతున్నాం అని పేర్కొన్నారు

Exit mobile version