Ashada bonalu: హైదరాబాద్ లో ఆషాడ బోనాలు పండుగ మొదలుకానుంది. వచ్చే నెల 22న హైదరాబాద్‌లో ఆషాడ బోనాల జాతర ప్రారంభం కానుంది. గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి (ఎల్లమ్మ) అమ్మవారికి తొలిబోనంతో ఈ నెలరోజుల ఉత్సవాలు ప్రారంభమవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్లాజాలో బోనాల ఏర్పాట్లపై మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మేయర్ విజయలక్ష్మి, డీజీపీ అంజనీకుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. జూన్ 22న గోల్కొండలో ఆషాఢ బోనాలు ప్రారంభిస్తామన్నారు. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, జూలై 10న రంగం.. ఆధ్వర్యంలో ఊరేగింపు ఉంటుందన్నారు. జూలై 16న పాతబస్తీ బోనాలు, జూలై 17న ఉమ్మడి దేవాలయాలు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పేందుకే బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Customer: అప్పు ఇవ్వని షాప్ యజమాని.. కర్రతో దాడి చేసిన కస్టమర్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిలో బోనంకు ప్రత్యేక స్థానం ఉంది. దేవతలకు బోనం ఎత్తే సంప్రదాయం తెలంగాణ అంతటా ఉంది. మహంకాళి బోనాలు, ఎల్లమ్మ బోనాలు, పోచమ్మ బోనాలు ఇలా వివిధ దేవతల పేరిట బోనాలు నిర్వహిస్తారు. అదే రీతిలో హైదరాబాద్‌లో ఏటా లష్కర్ బోనాలు నిర్వహిస్తారు. ఈ బోనాల సందర్భంగా బోనాల జాతర వైభవంగా జరుగుతుంది. ఉత్సవాల నేపథ్యంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. బోనాల జాతరలో బోనమెత్తిన మహిళలు, శివసత్తుల పూనకాలు, పోతురాజు నృత్యాలతో కన్నుల పండువగా సాగింది. గతేడాది జులై 17న ఉజ్జయిని మహంకాళి బోనాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా తలసాని కుటుంబీకులు ప్రత్యేక పూజలు చేశారు. రాజకీయాలకు అతీతంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామన్నారు.