Site icon NTV Telugu

రైల్వే అధికారులపై మండిపడ్డ మంత్రి తలసాని

హైదరాబాద్ సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్‌పేట డివిజన్‌లో బస్తీ దవాఖానాను శుక్రవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దక్షిణ మధ్య రైల్వే అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు వినియోగిస్తున్న రహదారులను రైల్వే అధికారులు మూసివేసి ఇబ్బందులకు గురి చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

Read Also: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన మంత్రి హరీశ్‌రావు

సనత్‌నగర్ పరిధిలో ఎన్నో సంవత్సలుగా రాకపోకలు సాగిస్తున్న రహదారిని ఎలా మూసివేస్తారని రైల్వే అధికారులను మంత్రి తలసాని ప్రశ్నించారు. మూసిన రహదారిని వెంటనే తెరవాలని టౌన్ ప్లానింగ్, పోలీసు అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ఇంత జరుగుతున్నా స్థానిక బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడంలేదని ఆయన ప్రశ్నించారు. రైల్వే అధికారులు బస్తీ ప్రజలను ఇబ్బందులకు గురి చేసే చర్యలను మానుకోవాలని మంత్రి తలసాని హితవు పలికారు.

Exit mobile version