స్వచ్ఛతలో హైదరాబాద్ నగరం ముందుంది. హైదరాబాద్ లో ఉన్న హాస్పిటలిటీ ఎక్కడా లేదు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నగరం దేశంలోని అన్ని నగరాలకు ఆదర్శంగా ఉంది. స్వచ్ఛతలో ఎన్నో అవార్డ్ లు హైదరాబాద్ కి వచ్చాయి అని చెప్పారు. హైదరాబాద్ నగరం కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకుపోతుంది. నగరంలోని పార్క్స్, రోడ్స్, బస్ షల్టర్స్ అన్ని కూడా సుందరంగా మారాయి. నగర వాసులు స్వచ్ఛ్ ఆటోలను ఉపయోగించుకోవాలి అని సూచించారు. చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెత్త సేకరణకు వచ్చిన ఆటోల్లోనే వేయాలి. హైదరాబాద్ ని మరింత స్వచ్ఛ నగరంగా మార్చాలి. హైదరాబాద్ ని గ్రీన్ సిటీగా మార్చడానికి అందరూ కృషి చేయాలి అని పేర్కొన్నారు మంత్రి తలసాని.
హైదరాబాద్ ని గ్రీన్ సిటీగా మార్చాలి : మంత్రి తలసాని
