Site icon NTV Telugu

Talasani Srinivas Yadav: గతంలో ఎవరైనా దళితుల అభివృద్ధి గురించి ఆలోచించారా..?

Talasani

Talasani

గతంలో ఎవరైనా దళితుల అభివృద్ధి గురించి ఆలోచించారా అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌ వెస్ట్‌ మారేడ్‌పల్లిలో దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రధాని మోదీ.. హైదరాబాద్‌ కార్పొరేటర్లను ఢిల్లీకి పిలిచి ఒట్టి చేతులతో పంపారని, నగర అభివృద్ధి కోసం నిధులిస్తే ప్రజలకు మేలు జరిగేదని విమర్శించారు. దళితుల సమగ్రాభివృద్ధి కోసమే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఆర్ధికంగా ఎంతో వెనుకబడిన దళితులు అభివృద్ధి సాధించాలనేది సీఎం కేసీఆర్‌ ఆలోచన అని చెప్పారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించే ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలులో లేదని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలి సూచించారు.

అనంతరం ఆయన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో దళిత బంధు ద్వారా లబ్ధిదారులకు మంజూరైన 27 వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తూ.. వారి కుటుంబాల్లో వెలుగు నింపుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నిరాదరణకు గురైన దళితులను వృద్ధిలో తీసుకురావడమే లక్ష్యంగా దళిత బంధు అమలు చేస్తున్నమని తెలిపారు. దేశంలో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఎక్కడ జరగలేదని అన్నారు. దళితుల్లో వివక్ష రూపుమాపి ఆర్థిక స్వావలంబన కోసమే ఈ దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ తీసుకోచ్చారని మంత్రి తలసాని పేర్కొన్నారు.

దళిత బంధు ద్వారా వచ్చిన వాహనాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేసుకోవాలన్నారు మందత్రి సూచించారు. ఇక నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ కార్పొరేటర్ లతో సమావేశమయిన ఈ విషయాన్ని మంత్రి తలసాని ప్రస్తావిస్తూ.. హైదరాబాద్ కు వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేస్తే బాగుండేదని అన్నారు. కార్పొరేటర్ లతో సమావేశం ఏర్పాటు చేసి వారిని ఒట్టి చేతులతో పంపడం హాస్యాస్పదమని మంత్రి తలసాని ఎద్దేవ చేశారు.

Exit mobile version