బీజేపీవి మొత్తం చీప్ ట్రిక్స్ రాజకీయాలేనని… మతకల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ యత్నిస్తుందని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ కు వస్తున్న ఐటీ, ఇతర కంపెనీలను చూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గర్వపడాలని.. బీజేపీ అధ్యక్షుడు చేయబోయే దీక్ష ఎందుకో చెప్పాలి, యువకులు బీజేపీ చేస్తున్న ట్రిక్స్ గమనించాలని కోరారు.
లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.. 14 లక్షల మంది వలస వెళ్లే పాలమూరు జిల్లాకు నేడు పాలమూరు జిల్లాకే వలస వస్తున్నారు ఇది అభివృద్ధి కాదా..అని చురకలు అంటించారు. చీఫ్ ట్రిక్స్ ఉపయోగించి రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు చేతనైతే తెలంగాణకు జాతీయ హోదా వచ్చేలా ప్రయత్నం చేయాలని రాష్ట్ర బీజేపీ నాయకులకు చురకలు అంటించారు.
