Site icon NTV Telugu

Minister Seethakka: దేవుళ్ల పేరుతో బీజేపీ రాజ‌కీయం చేస్తూ.. దేవుళ్లకే శ‌ఠ‌గోపం పెట్టింది..

Minister Seetakka

Minister Seetakka

Minister Seethakka: దేవుళ్ల పేరుతో రాజ‌కీయం చేస్తూ.. దేవుళ్ల‌కే శ‌ఠ‌గోపం పెట్టిన బీజేపీ అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలోని నిర్మల్ జిల్లా లో లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మంలో సీత‌క్క మాట్లాడుతూ.. గ్రామాల్లో జ‌రుగుతున్న‌ ఉపాధి హామీ ప‌నులు ప‌రిశీలించి, కూలీల‌తో స‌మావేశం అయ్యారు. మంత్రి సీత‌క్క మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకు నిత్యవసర స‌రుకుల ధరలు విపరీతంగా పెరిగినా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన వంద రోజులు పనికి గత పది ఏళ్ల నుంచి బీజేపీ ప్ర‌భుత్వ కూలీ పెంచ‌లేద‌ని అన్నారు.

Read also: Stock Market Down: ఉన్నట్లుండి కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 750పాయింట్లు డౌన్

అంతే కాకుండా పేద‌ల ఉప‌యోగించి వ‌స్తువుల‌పైన ప‌న్నులు వేసి పీడుస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే తప్ప గత పది సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి ప‌నులు ఎక్క‌డా చేయ‌లేద‌న్నారు. అయోధ్య రాముడు పేరుతో దేశంలో అన్ని కుటుంబాల నుంచి లక్షల కోట్లు చందాలు వ‌ల‌సూలు చేసి, ఖర్చు పెడుతున్నారే గాని, తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న భద్రాచలం రాముడికి మొండి చేయి చూపిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి, ఆర్టీసీ చార్జీలు పెంచారు. పేదలు ఉపయోగించే ప్రయాణ వాహనాలకు భారంగా మార్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రాగానే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం.

Read also: Pawan Kalyan :సీన్ లోకి హరిహర వీరమల్లు.. మరి ‘ఓజి’ రిలీజ్ పరిస్థితి ఏంటి..?

ఏడాదికి 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పి, కేంద్రంలో కొత్త నిబంధనాలతో ఉద్యోగుల భద్రత లేకుండా చేశారు. మ‌హిళా సంఘాలకు ప్రభుత్వం చేయూతనిచ్చేందుకు పథకాలను ప్రవేశపెడుతుంది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మహిళా సంఘాలకు ఇచ్చేందుకు ఆలోచిస్తున్నాం అన్నారు. ఉపాధి హామీ పథకం వ్య‌వ‌సాయానికి అనుసంధానం చేసి రైతులకు ఉపయోగపడనంగా చేస్తామ‌ని అన్నారు. గ‌త ప‌ది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు గాని, కొత్త పింఛన్ ల‌బ్ధిదారులను ఎంపిక చేయ‌లేదన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం పేదల కోసం అనేక పోరాటాలు చేశారు ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు ఏనాడు పదవికి ఆశపడలేదు. రాహుల్ గాంధీకి ఒక అవకాశం ఇచ్చి పేదల అభివృద్ధికి తోడు అవుదాం, దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుదామ‌ని పిలుపునిచ్చారు.
Padma Rao Goud: బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ను ఎంతో అభివృద్ది చేశాం..

Exit mobile version