NTV Telugu Site icon

Minister Seethakka: తొందరపాటు వద్దు.. కేటీఆర్ పై సీతక్క ఫైర్

Minister Seetakka Vs Ktr

Minister Seetakka Vs Ktr

Minister Seethakka: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధ్యం కాని హామీలు ఇచ్చారని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు అంత తొందర పాటు వద్దన్నారు. అధికారం పోయిందన్న బాధ కేటీఆర్‌ను వెంటాడుతోందన్నారు. అయితే.. తాము ఇస్తా అన్న దానికి బీఆర్ఎస్ వాళ్ళు పెంచి చెప్పారు కదా అని ప్రశ్నించారు. కాగా.. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఒక్కో హామీని అమలు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని తెలిపారు. కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు.

Read also: Traffic Diversion: ప్రయాణికులు అలర్ట్.. రాజ్ భవన్ రోడ్ క్లోజ్..

కేటీఆర్ ఏమన్నారంటే..

అయితే.. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదన్నారు. ప్రతి ఏడాది పీఏసీ, కాగ్ రిపోర్ట్స్ ఇస్తున్నామన్నారు. ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నామని తెలిపారు. లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా?, హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అని ప్రశ్నించారు. మేము ప్రతి ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశామని తెలిపారు. రేపు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని చెప్తారని అన్నారు. ఓ ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడని వ్యంగాస్త్రం వేశారు. ఎలా ఇస్తారు అంటే ఇస్తామని చెప్తున్నాడని తెలిపారు. ఇచ్చిన హామీలు చాలా ఉన్నయి.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ఉంది అసలు ఆట అంటూ కేటీఆర్ చిట్ చాట్ ద్వారా తెలిపారు. రెండు లక్షల రుణమాఫీ అధికారం లోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాంధీ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. మొదటి మంత్రి వర్గంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత తెస్తామన్న హామీ ఎక్కడ? అని ప్రశ్నించారు కేటీఆర్.
Rohit Sharma: కోలుకోలేకపోయా అంటూ.. ప్రపంచకప్‌ ఫైనల్ ఓటమిపై తొలిసారి స్పందించిన రోహిత్!