Minister Seethakka : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కుట్రకు తెరలేపిందని రాష్ట్ర మంత్రి సీతక్క తీవ్రంగా విమర్శించారు. పేదల జీవనాధారంగా ఉన్న ఈ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పేరుతో పాటు దాని ఆత్మను కూడా మార్చే ప్రయత్నం జరుగుతోందని సీతక్క తెలిపారు. పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం అత్యంత దుర్మార్గమైన చర్యగా ఆమె అభివర్ణించారు. ఉపాధి హామీ పథకం పట్ల కేంద్రానికి మొదటి నుంచే విముఖత ఉన్నదని, 100 రోజుల ఉపాధి కల్పించాల్సిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని అన్నారు.
Rahul Khanna: ఖన్నా బ్రదర్ న్యూడ్ ఫోటోషూట్‌తో వైరల్ ..
మోడీ ప్రభుత్వం ఏ ఏడాదీ 42 రోజులకన్నా ఎక్కువ పని దినాలు కల్పించలేదని సీతక్క ఆరోపించారు. ఉపాధి హామీ నిధుల్లో భారీ కోతలు విధించడం వల్ల గ్రామీణ పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. కేంద్రం తన వాటాను 60 శాతానికి మాత్రమే పరిమితం చేసి, మిగిలిన 40 శాతం భారం రాష్ట్రాలపై మోపుతోందని విమర్శించారు. దీని వల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడుతోందన్నారు. సెస్‌లు, సర్‌చార్జీల పేరుతో రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కేంద్రం కబళిస్తోందని ఆరోపించారు. ఈ విధానం సమాఖ్య స్పూర్తికి పూర్తిగా విరుద్ధమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని పూర్తి నిధులతో కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని, పేదల జీవన భద్రతను కాపాడాలని ఆమె కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
Marry Now Pay Later: పెళ్లిళ్లకు లోన్లు ఇస్తున్న ఫిన్టెక్ కంపెనీలు
