Site icon NTV Telugu

Minister Seethakka : PCC చీఫ్‌కు ఫిర్యాదు.. క్లారిటీ ఇచ్చిన సీతక్క

Seethakka

Seethakka

Minister Seethakka : మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులపై వస్తున్న వార్తలపై మంత్రి సీతక్క స్పందించారు. ఈ విషయమై పీసీసీ చీఫ్‌కు తాను ఎవరి మీదా ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధి పనుల విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడంతో, ఆ వార్తలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.

“మేడారం ఆలయ అభివృద్ధి మనందరి బాధ్యత. అక్కడ జరిగే పనులు అత్యంత ప్రాధాన్యమైనవి. వాటి చుట్టూ ఎలాంటి అపార్థాలు లేకుండా, సజావుగా పూర్తి కావాలని మాత్రమే కోరాను,” అని సీతక్క పేర్కొన్నారు. అదేవిధంగా, ఈ సున్నితమైన అంశంపై ఎలాంటి వివాదం లేకుండా, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగేలా చూడాలని పీసీసీ చీఫ్‌ను అభ్యర్థించినట్లు చెప్పారు.

“ఆదివాసీ వీరవనితలైన సమ్మక్క–సారలమ్మ ఆలయ అభివృద్ధి చుట్టూ ఎలాంటి చిన్నపాటి వివాదం కూడా ఉండకూడదని నా ఉద్దేశ్యం,” అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మీడియా ద్వారా వచ్చిన అపార్థాలు తొలగిపోయి, పనులు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా సమన్వయంతో కొనసాగుతున్నాయని తెలిపారు. “నేను ఎవరి మీదా పీసీసీ చీఫ్‌కు ఫిర్యాదు చేయలేదు. అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగాలని మాత్రమే కోరాను,” అని మంత్రి సీతక్క తేల్చి చెప్పారు.

AP Excise Suraksha App: నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ : సీఎం చంద్రబాబు

Exit mobile version