Site icon NTV Telugu

Satyavathi Rathod: ట్రిపుల్ ఐటీ విద్యార్థులను యాత్రల పేరుతో రెచ్చ గొడుతున్నారు

Satyavathi Rathod

Satyavathi Rathod

ట్రిపుల్ ఐటీ విద్యార్థులను యాత్రల పేరుతో రెచ్చ గొడుతున్నారని మండిపడ్డారు. మంత్రి సత్యవతి రాథోడ్. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన పడాల్సిన పని లేదని, చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. చిన్న విషయాల కోసం పోయి ట్రిపుల్ ఐటీ విద్యార్థులు భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని సూచించారు. డిమాండ్లను తీర్చేందుకు పని చేస్తున్నామని అన్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. ట్రిపుల్‌ వెల్ఫేర్ హాస్టల్ లో విద్యార్థి చనిపోవడం భాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

హాస్టల్ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఎక్కడైన అధికారుల నిర్లక్షం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రంలో 8 ఏళ్లుగా అధికారం లో ఉన్న వారికి ప్రజాసంగ్రామ యాత్ర ఎందుకని ప్రశ్నించారు. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడుతా మంటే.. అధికారం రాదు, జనం గుండెల్లో గూడు కట్టుకుంటే వస్తుందని ఎద్దేవ చేశారు. యాత్రల పేరుతో రెచ్చ గొడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర కాదు ఢిల్లీకి మోకాళ్ళ యాత్ర చేసి రాష్ట్రంకు రావాల్సి నిధులు తీసుకు రావాలని పేర్కాన్నొరు.
Pegasus Spyware Case: ఎలాంటి పెగాసస్ స్పైవేర్ గుర్తించలేదు.. విచారణకు కేంద్రం సహకరించలేదు

Exit mobile version