రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌కు పితృవియోగం కలిగింది. మంత్రి సత్యవతి తండ్రి లింగ్యా నాయక్ (85) ఈ రోజు ఉదయం పరమపదించారు. అయితే గత కొంతకాలంగా లింగ్యా నాయక్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని నివాసంలో ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. అయితే మంత్రి సత్యవతి రాథోడ్ మేడారం సమ్మక్క-సారక్క జాతర పర్యవేక్షణలో ఉన్నారు. తండ్రి మరణవార్త తెలియడంతో ఆమె హుటాహుటిన మేడారం నుంచి బయలు దేరారు. మంత్రి సత్యవతి తండ్రి మరణవార్త తెలియడంతో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు సానుభూతి తెలిపారు.
Satyavati Rathod: మంత్రి సత్యవతి రాథోడ్‌కు పితృవియోగం
