Ponnam Prabhakar: అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలు.. పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- బోనాల ఉత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బోనాల ఉత్సవాలు..
- గతం కంటే ఈసారి బోనాలను ఘనంగా నిర్వహించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: హైదరాబాద్ కలెక్టరేట్‌లో ఆషాడ మాసం బోనాల వేడుకలపై తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా బోనాల ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జరుపుకుంటున్న బోనాల పండుగను గతంలో కంటే అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని 2,400 ఆలయాలకు చెక్కుల పంపిణీ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈసారి ఆలయాలకు ఇచ్చే సొమ్మును పెంచాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి వెల్లడించారు. బోనాల సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కాగా, వచ్చే నెల 7 నుంచి బోనాల ఉత్సవం ప్రారంభం కానుంది.
Read also: Gold Rate Today: మగువలకు భారీ షాక్.. తులం బంగారంపై రూ.810 పెరిగింది!
Also Read
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
జూలై 7న ఆషాఢమాసం మొదటి ఆదివారం భాగ్యనగరంలో బోనాల సంబరం ప్రారంభమవుతుంది. గోల్గొండ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయాల్లో ప్రతి గురు, ఆదివారాలు నెల రోజుల పాటు నిర్వహిస్తారు. జూలై 7వ తేదీ ఆదివారం – గోల్గొండ జగదాంబికకు తొలిబోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూలై 11 గురువారం – రెండవ పూజ, జూలై 14 ఆదివారం – మూడవ పూజ కాగా.. జూలై 18 గురువారం – నాల్గవ పూజ నిర్వహిస్తారు. జూలై 21 ఆదివారం – ఐదవ పూజ, జూలై 25 గురువారం – ఆరోపూజ, జూలై 28 ఆదివారం – ఏడవ పూజ కాగా.. ఆగస్ట్ 1 గురువారం – ఎనిమిదవ పూజ అనంతరం.. ఆగస్టు 4 ఆదివారం – తొమ్మిదవ పూజ చేస్తారు. అంటే జూలై 7వ తేదీ ఆదివారం ప్రారంభమయ్యే బోనాలు…ఆగస్టు 4వ తేదీ ఆదివారంతో ముగుస్తాయి.
తాజావార్తలు
-
Nara Lokesh : ఏపీ శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు కుట్ర
-
West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. “కట్‌మనీ”పై టీఎంసీలో భయం..
-
Tata Tiago EV vs MG Comet EV: టాటా టియాగో EV వర్సెస్ ఎంజీ కామెట్ EV.. రూ.7 లక్షల బడ్జెట్లో ఏ ఎలక్ట్రిక్ కారు బెస్ట్?
-
Vaibhav Sooryavanshi: ‘ఒక్కే ఒక్క కండీషన్..’ వైభవ్‌పై క్రికెట్ గాడ్ సచిన్ సంచలన కామెంట్స్.. ఏం అన్నాడంటే?
-
Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..