Site icon NTV Telugu

Ponnama Prabhakar: రాజాసింగ్ జోతిష్యం చదివాడా.. బుద్ధి, జ్ఞానం ఉన్నవాళ్ళు ఇలా మాట్లాతారా?

Poinnama Prabhakar

Poinnama Prabhakar

Ponnama Prabhakar: రాజాసింగ్ ఏమైనా జోతిష్యం చదివాడా.. బుద్ధి,జ్ఞానం ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడవచ్చా..? అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లాలో పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకుసాగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరచాలని కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. 110 సీట్లలో డిపాజిట్లు రాని బీజేపీ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు నడువదు అంటున్నారని తెలిపారు. బుద్ధి,జ్ఞానం ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడవచ్చా..? అని ప్రశ్నించారు. ప్రజలు తీర్పు ఇచ్చారు..ప్రభుత్వం మారింది..మీ తీరు కూడా మార్చుకోండి అని తెలిపారు. రాజాసింగ్ ఏమైనా జోతిష్యం చదివాడా.. 10 మంది ఎమ్మెల్యేలు పోతారు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: IPL Auction 2024: ఐపీఎల్ 2024 వేలం ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో తెలుసా?

ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు గడవకముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారతారని ఏ ఉద్దేశ్యంతో వ్యాఖ్యానిస్తున్నారు? సీనియారిటీ ప్రకారం ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తే.. మతపరమైన అంశాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని వాపోయారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి రుజువు చేశారని ప్రజలు గమనించాలన్నారు. హైదరాబాద్‌లో మతకల్లోలాలు జరుగుతున్నాయంటే రాష్ట్రంలో బీజేపీ, ఇతర పార్టీలు హంగ్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యయుద్ధంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై సభ్య సమాజం ద్వేషిస్తోందన్నారు. అన్ని పార్టీల సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కా జవాబ్ పత్తర్ సే దేతే అని సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారరు..ప్రజలు నిర్ణయించారు..ప్రభుత్వం మారింది..ప్రతిపక్షాల ఆలోచనా ధోరణి మారాలి.
Trisha: 21 ఏళ్లు అవ్వడం గొప్ప కాదు… ఇన్నేళ్లుగా స్టార్ హీరోలతో చేస్తూనే ఉంది చూడు అది గొప్ప

Exit mobile version