Ponnam Prabhakar: రైతులకు పెట్టుబడి సహాయాన్ని గత ప్రభుత్వం ఏ మాదిరిగా ఇచ్చిందో అదే మాదిరిగా మేము ఇస్తామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మాట్లాడుతున్నారు. గ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే 6 గ్యారంటీలలో రెండు గ్యారెంటీలను నెరవేర్చామన్నారు. రవాణా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించామని తెలిపారు. కొంతమంది మాజీ మంత్రులు ఈ ప్రభుత్వాన్ని నడవనీయమంటున్నారని మండిపడ్డారు. రైతులకు పెట్టుబడి సహాయాన్ని గత ప్రభుత్వం ఏ మాదిరిగా ఇచ్చిందో అదే మాదిరిగా మేము ఇస్తామన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన ఏనాడు ప్రజలను కలిసేవాడు కాదన్నారు. ప్రగతి భవన్ ని గతంలో చూడని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు చూడవచ్చని అన్నారు. విద్యుత్ శాఖలో 85 వేల కోట్ల అప్పు ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి శాఖ పై శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన నచ్చక కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారని తెలిపారు. ప్రజా సమస్యలపై గత ప్రభుత్వంలో పాలకులను, అధికారులను కలిసే పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు కానీ… మాకు సమస్యలు పరిష్కరించే సమయం ఇవ్వాలని కోరారు.
Read also: Revanth Reddy: జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ.. చర్చగా మారిన అంశం..!
ఈ నెల 3న ఎన్నికల ఫలితాలు వెలువడితే 9న 6 గ్యారంటీలలో 2 హామీలు ప్రారంభించామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించామన్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచారు. ఇచ్చినట్లుగానే 100 రోజుల్లో 6 హామీలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వాన్ని నడపలేమని ప్రతిపక్షాలు చెబుతున్నాయన్నారు. గతంలో ఇచ్చినట్లే రైతుబంధు ఇస్తామని చెప్పిన మంత్రి పొన్నం గజ్వేల్ నుంచి గెలిచి ఒక్కసారి కూడా ఇక్కడి ప్రజలను కలవలేదన్నారు. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చారని పేర్కొన్నారు. అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజాస్వామిక పాలన అందిస్తామని, భూ నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతుబంధు లోపాలను సవరించి వీలైనంత త్వరగా రైతుబంధు నగదును అందజేస్తామని పొన్నం ప్రభాకర్ వివరించారు.
YSR Law Nestham: వైఎస్సార్ లా నేస్తం నిధుల విడుదల.. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్
