NTV Telugu Site icon

Ujjaini Maha kali Temple: అమ్మ‌వారికి బోనం స‌మ‌ర్పించిన కిష‌న్‌రెడ్డి

Ujjaini Maha Kali Temple

Ujjaini Maha Kali Temple

ఉజ్జయినీ మహంకాళి బోనాలు ఇవాళ ఉదయం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రారంభ‌మ‌య్యాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి జాతరకు అమ్మవారి దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సికింద్రాబాద్ ఉజ్జ‌యిని అమ్మ‌వారి బోనాల వేడుకలు ఘ‌టోత్స‌వంతో ప్రారంభ‌మ‌య్యాయి. నేడు తెల్లవారుజామునుంచే భక్తులు బోనాలు సమర్పించి, ఉదయం 4 గంటలకి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు జరిపించ‌గా.. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో దర్శించుకుని, అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు . కిషన్ రెడ్డికి ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికి, ఆశీర్వచనం చేశారు.

read also: Telugu Desam Party: రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ హౌస్ అరెస్ట్

అన‌త‌రం మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. గొల్కోండలో బోనాలు ప్రారంభమయ్యాయని, అనేక సంవత్సరాలుగా బోనాలు నిర్వహించే సంప్రదాయంగా వస్తోందన్నారు. దేశంలో ఈ రకమైన పండుగ ఎక్కడా కనిపించదని తెలిపారు. అంతేకాకుండా.. ధనిక, పేద అనే తేడా లేకుండా ఈ బోనాలు నిర్వహిస్తున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు. అంటు వ్యాధులు రాకుండా ప్రజలు ఇబ్బందులు పడకుండా, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించకూడా ఉండాలని.. కరోనా పూర్తిగా నయం కావాలని.. మానవత సమాజం విజయం సాధించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఉజ్జ‌యిని బోనాల సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారని.. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు కృషి చేస్తున్నారని కిషన్ రెడ్డి సతీమణి తెలిపారు. నేడు ఉదయం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉజ్జయినీ మహంకాళి బోనాలు ప్రారంభమయ్యాయి. అయితే.. ఉద‌యం తెల్ల‌వారుజామున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుటుంబసభ్యులతో క‌లిసి తొలి బోనం సమర్పించారు.

Neet Exam: నీట్ పరీక్షకు సర్వం సిద్ధం.. నిమిషం ఆలస్యం అయినా అంతే ఇక..