Site icon NTV Telugu

నాలుగో రోజు 6లక్షలకు పైగా ఖాతాల్లో రైతుబంధు

తెలంగాణలో నాలుగో రోజు 6 లక్షల 75 వేల 824 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 1144.64 కోట్ల రూపాయలు జమయ్యాయి. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. దీంతో కలిపి ఇప్పటి వరకు 52 లక్షల 71 వేల 91 మంది రైతులకు రైతుబంధు నిధులు అందింది. మొత్తం పెట్టుబడి సాయం రూ. 4246.68 కోట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. సంప్రదాయ సాగు నుంచి రైతులు బయటకు రావాలని సూచించారు.

Read Also: ఏపీలో మద్యం రేట్లు పెంచినా అడిగే వారే లేరు: విష్ణుకుమార్‌ రాజు

మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసేందుకు ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. డిమాండ్‌ ఉన్న పంటల సాగుకు రీసెర్చ్‌ వినాలసీస్‌ వింగ్‌ సలహాలు ఇస్తుంది. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను పరిశీలించి సీజన్ ముందు సాగు చేయాల్సిన పంటల వివరాలను రైతులకు అందిస్తాం. ఇతర పంటల్లో భాగంగా పప్పు, నూనెగింజల సాగు మరింత పెరగాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు.

Exit mobile version