Site icon NTV Telugu

రేపు రాబోయే తెలంగాణ ఫలితాలకు హుజురాబాద్ వేదిక కాబోతుంది…

ఇవాళ హుజురాబాద్‌ ప్రచారంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 200కిలో మీటర్ల దూరం నుండి హుజురాబాద్‌కు వచ్చానని… రేపు రాబోయే తెలంగాణ ఫలితాలకు హుజురాబాద్ వేదిక కాబోతుందని..ఒక్కరు కూడ తప్పు చేయవద్దని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రిగా హుజురాబాద్ లో కాలు మోపడం సంతోషంగా ఉందన్నారు. అత్యధిక మందికి ఆహారం అందించేది, ఉపాధి ఇచ్చేది వ్యవసాయ రంగమని… తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని బలోపితం చేయడం వల్లే అభివృద్ది సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.

read also : http://ఉమ్మడి మెదక్‌ జిల్లాలో నలుగురికి పీసీసీలో కీలక పదవులు !

కరోనా కష్ట కాలంలో కూడ రైతు బంధు, కొనుగోళ్ల విషయంలో ఏ మాత్రం వెనుక అడుగు వేయలేదన్నారు. 60లక్షల 80వేల మంది రైతులకు రైతుబందు ఇచ్చామన్నారు. టిఆర్ఎస్ కు కమలాపూర్ కంచుకోట అని..ఈటల రాజేందర్‌ రాక ముందే ఇక్కడ టీఆరెఎస్ బలపడి ఉందని చెప్పారు. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి పై ఉందని ..వెల్లడించారు. పాడి ప్రాసెసింగ్ యూనిట్ హుజురాబాద్‌లో ఏర్పాటు చేస్తామని.. గోదాములతో పాటు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Exit mobile version