Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Mallareddy Fires On Congress Bjp Leaders

Malla Reddy: ఎస్‌ఐ కాలర్‌ పట్టుకొని అహంకారాన్ని ప్రదర్శించడం దుర్మార్గం

Published Date :June 17, 2022 , 8:11 am
By NTV WebDesk
Malla Reddy: ఎస్‌ఐ కాలర్‌ పట్టుకొని అహంకారాన్ని ప్రదర్శించడం దుర్మార్గం
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్‌లో మహిళా కాంగ్రెస్‌ నేత ఎస్‌ఐ కాలర్‌ పట్టుకొని తన అహంకారాన్ని ప్రదర్శించడం దుర్మార్గమని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రభుత్వం ఊరుకోదని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని అరెస్ట్‌ చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీజేపీ నేతల వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు.

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆందోళనలు చేయడం దేనికని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ దివాళా తీసిందని, అలాగే బీజేపీ గ్రాఫ్‌ రోజురోజుకు పడిపోతుందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు లేని సమస్యను సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌ నేతలకు దమ్ముంటే ఢిల్లీలోని ప్రధాని మోదీ ఇంటి ఎదుట ధర్నా చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలకు ఢిల్లీలో నోటీసులు ఇస్తే రాష్ట్రంలో ఆందోళనలు చేయడమేంటని ప్రశ్నించారు. గురువారం బీఆర్‌కే భవన్‌ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌, బీజేపీ నేతల వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ నేతలకు ఆ పార్టీ నాయకులపై ప్రేముంటే ఢిల్లీకి వెళ్లి ప్రధాని కార్యాలయం, ఇంటి ఎదటో.. లేదంటేఈడీ కార్యాలయం ముందో ధర్నా చేయాలన్నారు.

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, ఇలాంటి వాతావరణాన్ని కలుషితం చేసి, ప్రజల్లో గందరగోళం సృష్టించాలని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ పోటీపడుతున్నాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై స్పష్టమైన అవగాహన, పట్టుదల ఉన్న నాయకుడని ఆయన పేర్కొన్నారు. సమయం..సందర్భం వచ్చినప్పుడు స్వయంగా సీఎం కేసీఆరే అన్ని విషయాలు వెల్లడిస్తారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇద్దరూ ఐరన్‌ లెగ్‌లేనని ఆయన దుయ్యబట్టారు. వాళ్లిద్దరూ ఎక్కడ అడుగుపెడితే ఆ ప్రాంతంలో వర్షాలే పడవని విమర్శించారు.

Aadhaar: పుట్టగానే ఆధార్‌ నంబర్‌.. ఆస్పత్రిలోనే కేటాయింపు..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BJP Party
  • Congress Party
  • Minister Mallareddy
  • rajbhavan
  • Renuka Chowdhury

తాజావార్తలు

  • CSK Vs SRH: టాస్ గెలిచిన సీఎస్కే.. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్.. ఇరు జట్లలోకి కొత్త ప్లేయర్లు..

  • Tecno Pop X 5G: టెక్నో పాప్ ఎక్స్ 5జీ రిలీజ్ డేట్ ఫిక్స్.. 6500mAh బ్యాటరీ, మిలిటరీ డ్యూరబిలిటీతో కొత్త గేమ్ చేంజర్!

  • Ponguleti Srinivas Reddy: తెలంగాణలో భూముల ధరలు పెంచేందుకు కసరత్తు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..

  • Shreyas Iyer: ‘సర్పంచ్ సాబ్’.. శ్రేయస్ అయ్యర్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

  • Jasprit Bumrah: పిచ్చినవ్వు.. భూమిని తన్నడం.. బుమ్రాను ఇలా ఎప్పుడూ చూడలేదు బ్రో..(వీడియో)

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions