ఈనెల 24 నుంచి బయోఏషియా-2022 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ పాల్గొననున్నారు. వర్చువల్‌గా జరిగే ఈ సమావేశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొంటారు. ఆ సమావేశంలో లైఫ్ సైన్సెస్ గురించి బిల్‌గేట్స్‌తో జరిగే చర్చలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గత రెండేళ్లుగా ఎదుర్కొన్న అనుభవాలు, హెల్త్‌కేర్‌లో కొత్త ట్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యవ్యవస్థను ఎలా బలోపేతం చేయాలన్న అంశాలపై బిల్‌గేట్స్, కేటీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Read Also: Chinna Jeeyar Swamy: కేసీఆర్‌తో విభేదాలేంటి..?
రెండు రోజుల పాటు జరిగే ఈ బయోఏషియా సదస్సులో ప్రభావంతమైన, విజినరీ నేతలు పాల్గొననున్నారు. 19వ బయోఏషియా సదస్సులో గేట్స్ పాల్గొనడం సంతోషకరమని బయోఏషియా సీఈవో శక్తి నాగప్పన్ తెలిపారు. 2021 సదస్సు అత్యంత సక్సెస్ సాధించిందని, అందులో 31వేల మంది డెలిగేట్లు పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు.
